ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌, సుప్రీంకోర్టు కండీషన్లు ఇవే

Published by: Shankar Dukanam

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించగా, తిహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు కవిత

గతంలో పలుమార్లు రిజెక్ట్ కాగా, తాజాగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది

ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది

రూ.10 లక్షల చొప్పున ప్రతి కేసులోనూ రెండు పూచీకత్తులు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది

కేసులో సాక్ష్యులను ప్రభావితం చేయకూడదు. సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలని కండీషన్

ఎమ్మెల్సీ కవిత తన పాస్ పోర్ట్‌ను సమర్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది

కేటీఆర్, హరీష్ రావు నెలలపాటు శ్రమించడంతో ఎట్టకేలకు కవితకు బెయిల్ లభించింది