రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ గణేష్ చతుర్థి సందర్భంగా ఊరువాడా అనే తేడా లేకుండా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహించుకున్నాం. వినాయక నిమజ్జనం అనగానే గుర్తుకొచ్చేది ముగింపు వేడుకలు. ఎంతో సంబరంగా నిమజ్జనంలో అంతా పాల్గొంటారు గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే వేలం పాట, ఏ లడ్డూ ఎక్కువ ధర పలికింది అని చర్చించుకుంటారు. మై హోమ్ భుజాలో ఏర్పాటు చేసిన గణేషుడి వద్ద వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 29 లక్షలు పలికింది ఈసారి ఎలాగైనా గణేషుడి లడ్డూను వేలం పాటలో దక్కించుకోవాలని భావించి పాల్గొన్నట్లు విజేత తెలిపారు తమకు ఇక నుంచి మరింత మంచి జరుగుతుందని, విఘ్నేశ్వరుడు తమను చల్లగా చూస్తాడని ఆకాంక్షించారు ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వేలం పాటలో మై హోమ్ భుజా గణపయ్య లడ్డూ దక్కించుకున్నారు వేలంలో మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా, గణేషుడి లడ్డూ కోసం మాత్రం తీవ్ర పోటీ ఉంటుందని తెలిసిందే.