ఖైరతాబాద్‌ మహాగణపతికి భారీ ఆదాయం, ఇక బైబై గణేశా

గణేష్ చతుర్థి సమయంలో హైదరాబాద్‌ అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్‌ మహాగణపతి, బాలాపూర్ గణేషుడు

ఈ ఏడాది ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల మహాగణపతి పూజలందుకున్నాడు

మొత్తం రూ.1.10 కోట్ల రూపాయాలు ఆదాయం రాగా, హుండీ ద్వారా రూ.70 లక్షలు, హోర్డింగులు, ప్రకటనల ద్వారా రూ.40 లక్షలు

సెప్టెంబర్ 15న ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తులకు దర్శనాలు నిలిపివేశారు

సోమవారం అర్ధరాత్రి ఖైరతాబాద్ బడా గణేష్ కు చివరి పూజ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిమజ్జనం చేయనున్నారు

ఇప్పటికే పలుచోట్ల వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించిన అనంతరం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు

ఇళ్లల్లో ఏర్పాటు చేసిన పర్యావరణహిత మట్టి గణపయ్యలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు

భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌లో మంగళవారం వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది