పిక్నిక్ స్పాట్స్‌

కార్తీక మాసంలో హైదరాబాద్‌కు సమీపంలోని మంచి పిక్‌నిక్‌ స్పాట్‌లు ఇవే

Published by: Khagesh
Image Source: X

భువనగిరి కోట

గుడ్డు ఆకారపు ఏకశిలా శిలపై ఉందీ భువనగిరి కోట. చారిత్రక నిర్మాణాలు ఆకర్షిస్తాయి. దూరం: 101 కి.మీ

Image Source: X

మెదక్‌ కోట

కాకతీయ, కుతుబ్ షాహీలను గుర్తు చేస్తుంది. నిర్మాణం ఆకర్షణీయంగా ఉంటుంది. కోటతో గిడ్డంగి, సరస్సు, బ్యారక్‌లు చూడొచ్చు. దూరం: 100 కి.మీ

Image Source: X

ఉస్మాన్ సాగర్‌ లేక్

హైదరాబాద్ సమీపంలోని టాప్‌ పిక్నిక్ స్పాట్‌. ప్రశాంత వాతావరణంలో విహారయాత్రకు పర్ఫెక్ట్‌ ప్లేస్. పిల్లలు ఆడుకునే పార్క్ కూడా ఉంది. దూరం: 23 కి.మీ

Image Source: X

మృగవణి జాతీయ పార్క్

కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి అద్భుతమైన ప్రదేశం. హైదరాబాద్‌ శివారులోని టాప్‌ పిక్‌నిక్ స్పాట్. దూరం: 21 కి.మి

Image Source: X

నల్లమల హిల్స్

నల్లమల కొండల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లవచ్చు. అభయారణ్యం సందర్శించవచ్చు ఒకట్రెండు రోజులు ఉండడానికి ఇది మంచి ప్లేస్‌. దూరం: 222 కి.మీ

Image Source: X

కీసర గట్టు

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కోసం భారీగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ వద్ద గుప్తుల కాలం నాటి చిహ్నాలు కనిపిస్తాయి. దూరం: 38 కి.మీ

Image Source: X

సింగూర్ డ్యామ్

కుటుంబంతో కలిసి వెళ్లదగ్గ ఒక రోజు పిక్నిక్ స్పాట్‌. రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. దూరం: 97 కి.మీ

Image Source: X

పోచారం అభయారణ్యం

రోజంతా గడపాలని కోరుకుంటే పోచారం అభయారణ్యం మంచి స్పాట్‌. ఇక్కడ కూడా ట్రెక్కింగ్‌ ఫెసిలిటీ ఉంది. దూరం: 115 కి.మీ

Image Source: X

బీదర్

చరిత్రపై ఆసక్తి ఉన్న వాళ్లకు అత్యంత అద్భుతమైన టూరిజం స్పాట్. గగన్ మహల్, రంగీన్ మహల్ ఆకట్టుకోనున్నాయి. దూరం: 145 కి.మీ

Image Source: X

రాచకొండ కోట

చరిత్ర అభిమానులు సందర్శించాల్సిన ప్రదేశం. హైదరాబాద్‌కు కేవలం 61 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ట్రెక్కింగ్ ఫెసిలిటీ ఉంది.

Image Source: X

అనంతగిరి హిల్స్

హైదరాబాద్‌కు దగ్గరలోని వన్ డే పిక్నిక్ స్పాట్‌. ట్రెక్కింగ్‌ చేస్తూ అందాలు ఆస్వాదించవచ్చు. 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.