'నాట్య తరంగిణి' యామిని రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా!

Published by: RAMA

యామిని రెడ్డి

కూచిపూడి విద్వాంసులు పద్మభూషణ్‌లు డా. రాజా రాధా రెడ్డి , కౌశల్య రెడ్డి పెద్ద కుమార్తె & శిష్యురాలు

3 సార్లు జాతీయ అవార్డ్ గ్రహీత

భారతదేశం సహా విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించి మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు యామిని రెడ్డి.

పలు దేశాల్లో నృత్య ప్రదర్శనలు

రెడ్డీస్ యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, UAE, సౌత్ ఈస్ట్ ఆసియాలో యామిని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు

ఎన్నో అవార్డులు

మూడుసార్లు జాతీయ అవార్డు అందుకోవడంతో పాటూ..డిస్ట్రిక్ట్ రోటరాక్ట్ ఆర్గనైజేషన్ ద్వారా 'యువరత్న అవార్డు' యూత్ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు, FLO ఢిల్లీ - హైదరాబాద్ ద్వారా యంగ్ అచీవర్స్ అవార్డు, 'దేవదాసి జాతీయ అవార్డు' అందుకున్నారు యామిని రెడ్డి

యువ పురస్కారం

సంగీత నాటక అకాడమీ ద్వారా బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం (2007). SBJ లెజెండ్స్ ఆఫ్ టుమారో టైటిల్, న్యూస్24 ద్వారా జష్న్-ఎ-యంగిస్థాన్ 'ప్రైడ్ ఆఫ్ తెలంగాణ' అవార్డు (2019) అందుకున్నారు

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి

2011లో ప్రతిష్టాత్మకమైన విగ్మోర్ హాల్ లండన్‌లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి నృత్యకారిణి యామిని. జాతీయ ,అంతర్జాతీయ ఉత్సవాల్లో సోలో పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొన్నారు యామిని రెడ్డి.

దిగ్గజాల నుంచి ప్రశంసలు

భారతరత్న పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్ , సరోద్ రాణి శరణ్ రాణి బ్యాక్లీవాల్, సంగీత నృత్య రంగంలో దిగ్గజాల నుంచి అభినందనలు అందుకున్నారు యామిని రెడ్డి.

నాట్య తరంగిణి

ప్రస్తుతం యామిని హైదరాబాద్‌లో తన సొంత సంస్థ 'నాట్య తరంగిణి - రాజా రాధా రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్'ని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థను ఆమె తల్లిదండ్రులు రాజా రాధా రెడ్డి & కౌశల్య రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కూచిపూడి నృత్య కళలో శిక్షణ ఇస్తున్నారు.