Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP Desam
అనంతపురం జిల్లా పోలీసులు దక్షిణ భారతదేశాన్ని వణికిస్తున్న ఓ కరుడుకట్టిన దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన దొంగల ముఠాను పట్టుకున్నాురు అనంతపోలీసులు. అనంతరపురంలోని శ్రీనగర్ కాలనీ రాజహంస స్వీట్ హోమ్స్ లో మూడు విల్లాల్లో జనవరి చివర్లో భారీ చోరీ జరిగింది. దాదాపుగా రెండు కోట్ల రూపాయల విలువైన బంగారపు ఆభరణాలు కొట్టేయటంతో పోలీసులు ఈ కేసును సీరియస్ ఇన్విస్టిగేట్ చేస్తే..నిందితులు ధార్ గ్యాంగ్ ముఠాగా తెలిసింది. దొంగతనానికి పాల్పడిన ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి సుమారు రూ. 90 లక్షల విలువ చేసే 59 తులాల బంగారు వస్తువులు వజ్రాలు పొదిగిన ఆభరణాలు మరియు రూ. 19,35,000/- నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై మూడు రాష్టాల్లో దాదాపు 55 నుంచి 60కేసులు ఉన్నాయి. కార్తీ ఖాకీ సినిమాలో చూపించినట్లుగా గుంపులుగా విడిపోయి దొంగతనాలు చేయటం...విచారణకు వచ్చిన పోలీసులపై ఊరంతా కలిసి దాడి చేయటం లాంటివి చేస్తారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వివరించారు.





















