Warangal News: ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలకు బ్రేక్ - 3 రోజులుగా ఇంటి ముందే శవం - ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు !
Warangal: తండ్రి చనిపోతే గుండెలు అవిసిపోయేలా ఏడ్చే కొడుకులుంటారు. కానీ ఈ కొడుకు మాత్రం ప్రత్యేకం. తండ్రి చనిపోతే అంత్యక్రియల్ని కూడా ఆపేశాడు.

Warangal Mn stopped his father funeral for his property : మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటను అందెశ్రీ ఏ టైంలో పాడాడో కానీ. ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉన్న సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. జనగామ జిల్లా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను నిలిపివేశాడు కుమారుడు. మూడు రోజులుగా తండ్రి శవాన్ని ఇంటి ముందు ఉంచి ఆస్తి కోసం పట్టుపడుతున్నాడు.
అంత్యక్రియలు చేయాలంటే రెండు ఎకరాల ఆస్తి ఇవ్వాలని పట్టుబడుతున్న కొడుకు
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏవడునూతల గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వెలికట్టే యాదగిరి కి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు, రెండో భార్యకి ఒక కుమారుడు ఒక కూతురు అన్నారు. యాదగిరి కి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా మొదటి భార్య కొడుకుకి ఐదు ఎకరాలు, రెండో భార్య కొడుకుకి ఐదు ఎకరాలు, కూతురికి ఐదు ఎకరాల ఆస్తి మూడు భాగాలుగా పంచడం జరిగింది. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు చనిపోగా అతనికి భార్య, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అతని వాటా ఐదు ఎకరాల ఆస్తిని కూతురు పేరు మీద రాసింది. అయితే కూతురికి రాసిన ఐదెకరాల భూమిలో మూడు ఎకరాలు భూమిని అమ్ము కోగా రెండు ఎకరాలు మిగిలింది.
పంచాయతీ తేలకపోవడంతో మూడు రోజులుగా ఇంటి ముందే తండ్రి శవం
తండ్రి యాదగిరి మూడు రోజులక్రితం సోమవారం రోజు చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలను కుమారుడు నిర్వహించాలి. రెండవ భార్య కుమారుడు చనిపోగా మొదటి భార్య కుమారుడు ఉన్నాడు. దీంతో రెండవ భార్య కూతురు పేరు మీద రాసిన ఐదు ఎకరాల్లో మిగిలి ఉన్న రెండు ఎకరాలు భూమి తన పేరు మీదకు చేసే వరకు అంత్యక్రియలు జరగనివ్వనని కుమారుడు అడ్డుకున్నాడు. దీంతో అన్న , చెల్లెల మధ్య ఆస్తి తగాదాతో మూడు రోజుల నుండి తండ్రి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇంటి ముందు తండ్రి శవం పెట్టుకొని కుమారుడు చెల్లి పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమి కోసం అన్న అడ్డు పడుతున్నాడు.
పెద్దలు కల్పించుకున్నా వినని కుమారుడు
గ్రామంలోని పెద్ద మనుషులు, బందువులు రాజీకి కుదిర్చిన వినకపోవడంతో మూడు రోజులు తండ్రి యాదగిరి దహన సంస్కారాలు నిలిచిపోయాయి. ముందు అంత్యక్రియలు నిర్వహిస్తే తర్వాత ఆస్తుల గురించి చూసుకుందామని చెబుతున్నా అతను వినడం లేదు. ఈ విషయం పోలీసులకూ వెళ్తే కానీ .. అతను స్పందించడని కంత మంది పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తున్నారు.
Also Read: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు





















