New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Mee Seva centers accepting ration card applications | కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు మీసేవ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించారు.

Telangana Ration Card Applications | హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణపై అర్హులైన వారికి కీలక అప్‌డేట్ వచ్చింది. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంపై క్లారిటీ వచ్చేసింది. మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. మీసేవ అధికారులతో హైదరాబాద్‌లోని సివిల్ సప్లయిస్ భవన్‌లో సోమవారం సమావేశమై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ సోమవారం సాయంత్రం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇందుకోసం మీసేవ వెబ్‌సైట్‌లో ‘మీ- దరఖాస్తుల స్వీకరణ’ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రేషన్ కార్డులు లేని వారు ఏ సమస్యా లేకుండా మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు.
మళ్లీ దరఖాస్తు అవసరం లేదు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ప్రజాపాలనలో గానీ, కుల గణనలో గానీ పాల్గొని దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు ‘ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. కనుక మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు పదే పదే చెక్ చేయడంతో అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీలో మరింత జాప్యం తలెత్తే అవకాశం ఉందని’ సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు.
రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌కు పౌరసరఫరాలశాఖ సూచించింది. ఈ క్రమంలో మీసేవ కేంద్రానికి ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. అయితే ఫిబ్రవరి 7న మీసేవ వెబ్ సైట్లో ఆప్షన్ కనిపించింది. ఫిబ్రవరి 8న ఉదయం నుంచి ఆప్షన్ కనిపించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత ఈ తలనొప్పి ఏంటనుకున్నారు. అయితే ప్రజల అవసరం, రేషన్ కార్డులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సోమవారం నాడు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీసేవ కమిషనర్ కు స్పష్టం చేయడంతో మీసేవ వెబ్ సైట్లో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
Also Read: New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? ఇలా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

