Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Telangana News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు తలెత్తాయి. పెచ్చులు ఊడి పడ్డాయి. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ప్రమాదం ఏమీ లేదని చెబుతోంది.

Telangana News: తెలంగాణ సచివాలయంలో పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. పీవోపీ పార్టిషన్‌లో లోపాలు కారణంగా పెచ్చులుగా ఉడిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అటుగా ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉండే ఛాంబర్‌లోనే పెచ్చులు ఊడి పడ్డాయి. పీవోపీ పార్టిషన్ నిర్మాంలో లోపాలు కారణంగానే ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ పెచ్చులు రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇప్పుడు పెచ్చులు ఊడిపడటంతో సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందో అని కంగారు పడుతున్నారు. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. పెచ్చులు ఊడి పడిన ప్రాంత వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సచివాలయ నిర్మాణం జరిగింది. దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్న నిర్మాణం ఇలా పెచ్చులు ఊడి పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
పెచ్చులు ఊడిపడటం నిర్మాణంలో లోపాలు కాదని షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రకటించింది. డిపార్ట్‌మెంట్ పనుల్లో భాగంగా చేస్తున్న డ్రిల్లింగ్ కారణంగా ఇది జరిగినట్టు పేర్కొంది. సచివాలయం నిర్మాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. జరిగిన ఘటనపై రివ్యూ చేస్తున్నామని తెలిపారు.
రెండేళ్లు అవుతున్న తెలంగాణ సచివాలయంలో ఇలా పెచ్చు ఊడి పడటం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ మద్దతు దారులు దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Quality Issues Exposed in BRS-Built Secretariat: Ceiling Plaster Falls from 7th Floor
— Congress for Telangana (@Congress4TS) February 12, 2025
గత BRS ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయంలో బయటపడ్డ నాణ్యత లోపం
7వ అంతస్తు నుంచి ఒక్కసారిగా ఊడిపడిన పెచ్చులు pic.twitter.com/XiFFtEup1z





















