తెలంగాణలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లెక్కలను వెల్లడించింది.



సర్వే వివరాలను అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.



3,54,77,554 మందిని సర్వే చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.



సర్వే ప్రకారం ఎస్సీల సంఖ్య- 61,84,319 మంది(17.43శాతం)



సర్వే ప్రకారం ఎస్టీల సంఖ్య-37,05,929 మంది (10.45శాతం)



సర్వే ప్రకారం బీసీల(ముస్లింలుకాకుండా) సంఖ్య- 1,64,09,179 మంది(46.25శాతం)



సర్వే ప్రకారం ముస్లింల సంఖ్య- 44,57,012 మంది( 12.56శాతం)



సర్వే ప్రకారం ముస్లింలలో బీసీల సంఖ్య- 35,76,588 (10.08 శాతం)



సర్వే ప్రకారం ముస్లింలలో ఓసీల సంఖ్య- 8,80,424(2.48 శాతం)



సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓసీల సంఖ్య- 56,01,539(15.79 శాతం)



సర్వే ప్రకారం ఓసీల్లో ముస్లింల సంఖ్య- 8,80,424 (2.48శాతం)



సర్వే ప్రకారం ఓసీల్లో నాన్‌ముస్లింల సంఖ్య- 47,21,115(13.31 శాతం )



సర్వేలో మొత్తం 75లో ప్రశ్నలు అడిగిన ఎన్యుమరేటర్లు



1,12,15,134 కుటుంబాలపై సర్వే నిర్వహించారు. గ్రామాల్లో 66,99,602 - నగరాల్లో 45,15,532 కుటుంబాలు ఉన్నాయి.