కృష్ణా నది ఉపనదైన మూసీ వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుడుతుంది



మూసా లేదా ముచ్చుకుందా అంటారు. లంగర్ హౌస్ ప్రాంతంలో ఈసీ, మూసా కలిసి మూసీగా మారుతుంది.



267 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది



పూర్వకాలంలో మూసీ నదికి భారీగా వరదలు వచ్చి హైదరాబాద్‌ను ముంచెత్తేవి.



మీర్ మహబూబ్ అలీఖాన్ విజ్ఞప్తితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గండిపేట, హిమాయత్ సాగర్‌ జలాశయాలకు ప్లాన్ చేశారు



పూర్వకాలంలో స్వచ్ఛమైన నీటితో ప్రవహించే మూసీ నది హైదరాబాద్‌ దాహార్తిని తీర్చేది.



1980 తర్వాత వ్యర్థ జలాలు కలిసి మూసీ నదిని మురికికూపంగా మార్చాయి.



మూసీ నది ప్రక్షాళనకు 1997లో టీడీపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది.



బాపూఘాట్ నుంచి నాగోలు వరకు నందనవనం పేరుతో కొన్ని పనులు చేపట్టింది.



కోర్టు కేసులు వివిధ ఇతర కారణాలతో ప్రాజెక్టును 2001లో నిలిపేశారు.



2005లో సేవ్ మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 908 కోట్లతో సుందరీకరణకు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు.



2014లో మూసీ అభివృద్ధికి ప్రత్యేక విభాగాన్ని తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.



2017 మార్చి 25న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.16,635 కోట్ల అంచనాతో పనులు



కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.58వేల కోట్లతో పనులు ప్రారంభించబోతున్నట్టు ప్రకటన



2024-25 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపు - ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల ఖర్చుకు రెడీ