Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Bhatti: తెలంగాణ ప్రభుత్వం మరోసారి కులగణన చేయాలని నిర్ణయించుకుంది. చాలా మందిని మిస్ అయ్యారన్న విమర్శలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Telangana government has decided to conduct caste census once again: తెలంగాణ ప్రభుత్వం కులగణన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కులగణనలో జనాభా తగ్గిపోయారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో గత సర్వేలో తమ వివరాలు నమోదు చేయించుకోని వారి కోసం ఈ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అనుకున్నారు. అయితే కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
కులగణన సర్వేలో పేర్లు నమోదు చేసుకోని 3.1 శాతం మంది
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రవేశ పెట్టారు. అయితే చాలా మంది వివరాలు నమోదు చేయలేదని.. ఉద్దేశపూర్వకంగా జనాభాను తగ్గించారని రాజకీయ నేతలు, బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పదేళ్ల కిందట కేసీఆర్ సమగ్ర కుటుంబసర్వేను చేశారు. అప్పటి రికార్డులతో పోలిస్తే ఇప్పుడు జనాభా తగ్గిపోయారని..కుటుంబాలు తగ్గిపోయారని ..ఇది ఫేక్ సర్వే అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కొంత మంది ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదని చెబుతోంది.
రీ సర్వే ద్వారా సమగ్రంగా నివేదిక రెడీ అయ్యే అవకాశం
వివరాలు ఇవ్వాలా లేదా అనేది నిర్బంధం కాదని ప్రభుత్వం చెబుతోంది. అందుకే కేసీఆర్, కేటీఆర్ వంటి వారు ఉద్దేశ పూర్వకంగా సర్వేలో వివరాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టడానికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే స్పష్టంగా ఉందని .. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి అభివృద్ధికి మద్దతు పలకాలని పేర్లు నమోదు చేసుకోని వారికి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కులగణనలో పాల్గొనని 3.1 శాతం మంది కోసం మరోసారి సర్వే చేపడుతున్నామని ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అవసరం లేదని భట్టి విక్రమార్క ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే స్థానిక ఎన్నికలు
కులగణన నివేదిక ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. అయితే నివేదికపైనే అసంతృప్తి రావడంతో.. రీసర్వే నిర్ణయం తీసుకున్నారు. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లుల కల్పించడమే లక్ష్యంగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. రీ సర్వే కు నిర్ణయం తీసుకోవడంతో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. రీసర్వే తర్వాత మరోసారి డెడికేటెడ్ కమిషన్ కు వివరాలను పంపి ..మరోసారి సిఫారసులు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నారు. కానీ.. రిజర్వేషన్ల సంగతి తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ..మరోసారి స్థానిక ఎన్నికలు వాయిదా పడినట్లయింది.
Also Read: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

