Elon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam
విశ్వాంతరాల అన్వేషణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకొస్తూనే ఉంటాయి. ఈ మధ్య బయటకొచ్చిన ఓ సంగతి అంతరిక్ష అన్వేషకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఏంటా విషయం అంటే.. మార్స్ మీద చతురాస్రాకారంలో ఉన్న ఓ గుర్తును గుర్తించారు. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తును NASA కు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ (MOC) ఫోటోలు తీసింది. ఆ గుర్తును చూసినప్పటి నుంచి స్పేస్ అన్వేషకులు ( Space Enthusiasts) నుంచి సామాన్యుల వరకూ వారి వారి కోణంలో థియరీలు చెబుతున్నారు. అయితే స్పేస్ థియరీలపై, అంతరిక్ష కార్యక్రమాలపైనా విపరీతమైన ఆసక్తిని చూపించే గ్లోబల్ డ్రీమర్, Space CEO ఎలాన్ మస్క్- Elon Musk కూడా దీనిపై స్పందించాడు. ఆ గుర్తుల గుట్టేంటో బయట పెట్టాలంటున్నాడు. మస్క్ సంగతి తెలిసిందే కదా.. కేవలం తన ఆసక్తి మేరకే స్పేస్ ప్రోగ్రామ్స్‌లో వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దీనిపై కన్నేశాడు అంటే దాని సంగతేంటో చూడాలి అనుకుంటున్నట్లు అర్థం.





















