అన్వేషించండి

New Renault Duster Launch: మార్చి 17న కొత్త రెనాల్ట్ డస్టర్ విడుదల.. 7 సంవత్సరాల వారంటీతో మరింత ప్రత్యేకం

New Renault Duster: రెనాల్ట్ డస్టర్ SUV గతంలో మిడ్-సైజ్ విభాగంలో కస్టమర్ల ఆదరణ పొందింది. కంపెనీ కొత్త ప్లాన్‌లపై ఫోకస్ చేసినందున డిసెంబర్ 2022లో దీనిని నిలిపివేశారు.

భారత మార్కెట్లో కొత్త Renault Duster మార్చి 17న లాంచ్‌కు సిద్ధంగా ఉంది. రెనాల్ట్ కంపెనీ కొత్త డస్టర్‌తో 7 ఏళ్ల వారంటీని అందించడం ఇదే తొలిసారి. ఈ కారు బుకింగ్‌లు రూ. 21,000 తో ప్రారంభమయ్యాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు ఏప్రిల్ 2026 నాటికి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ డెలివరీలు ఈ ఏడాది దీపావళి సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కారు డిజైన్ ఎలా ఉంటుంది?
న్యూ రెనాల్ట్ డస్టర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ లుక్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ (LED) టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఎత్తుగా ఉన్న బోనెట్ దీనికి పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ముందు భాగంలో పెద్ద బంపర్, గ్రిల్‌పై రెనో లోగో అమర్చారు. అలాగే వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్, వెనుక వైపు పలు రంగుల్లో ఉన్న బంపర్ ఇన్సర్ట్ కొత్త రెనాల్డ్ డస్టర్‌ను మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.

రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
లోపలి భాగంలో కూడా కొత్త డస్టర్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ఇంటీరియర్‌లో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ సపోర్ట్‌తో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇవి కాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు. 

మీరు డ్రైవర్ సీటును వివిధ రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు సీట్లలో కూలింగ్ సదుపాయం (Ventilated seats) కూడా ఉంటుంది. సేఫ్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, 17 ఫీచర్లు ఉన్న ADAS ప్యాకేజీ ఇవ్వనున్నారు. రెనాల్ట్ కంపెనీ ప్రకారం, దీని బూట్ స్పేస్ రూఫ్ వరకు కొలిస్తే సుమారు 700 లీటర్లు ఉంటుంది. ఇది లాంగ్ జర్నీ చేసేవారికి బెస్ట్ ఛాయిస్‌గా నిలవనుంది. 

ఈ డస్టర్ SUV గతంలో కూడా మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో బాగా ఫేమస్ అయింది. కస్టమర్ల ఆదరణతో భారీగా అమ్మకాలు జరిగాయి. కంపెనీ తన కొత్త వ్యూహాలతో పని చేస్తున్నందున డిసెంబర్ 2022లో డస్టర్ మోడల్ నిలిపివేసింది. ఇప్పుడు కంపెనీ నేరుగా కొత్త గ్లోబల్ మోడల్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget