అన్వేషించండి

కేవలం 50,000 డౌన్ పేమెంట్ తో Maruti WagonR కొంటే, నెలవారీ EMI ఎంత చెల్లించాలి

Maruti WagonR on EMI: మీ క్రెడిట్ స్కోరు బాగుంటే కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్‌తో మారుతి వ్యాగన్ఆర్ కొనేయండి. అయితే వాహనం పూర్తి ఫైనాన్స్ ప్లాన్ తెలుసుకున్నాక కొనడం మంచిది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు మరియు ఆఫీసులకు వెళ్లేవారికి మొదటి ఎంపికగా నిలుస్తోంది. కంపెనీ దీని భద్రతను పెంచుతూ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌ల స్టాండర్డ్ ఫీచర్‌ను కూడా అప్‌డేట్ చేసింది, దీనితో ఇది మునుపటి కంటే మరింత సురక్షితంగా మారింది.

ఢిల్లీలో Wagon R బేస్ LXI పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 4.98 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. RTO, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను కలిపిన తర్వాత దీని ఆన్-రోడ్ ధర సుమారు 5.63 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్‌లో R బేస్ LXI ఎక్స్ షోరూమ్ ధర రూ. 4,98,900. కాగా ఆన్ రోడ్ ధర రూ. 5,94,256 అవుతుంది. వేర్వేరు నగరాలు, వేరియంట్‌లను బట్టి ధరలో స్వల్ప తేడాలు ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు ఈ కారును కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి కూడా కొనుగోలు చేయవచ్చు.

ప్రతి నెలా EMI ఎంత ఉంటుంది?
ఒకవేళ మీరు 50 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి మారుతి వాగన్ ఆర్ కారును కొనుగోలు చేస్తే, ఆ తర్వాత సుమారు రూ. 5.13 లక్షల కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకున్నారని అనుకుంటే, ప్రతి నెలా మీ EMI సుమారు 10,664 అవుతుంది. మొదటిసారి కారు కొనేవారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు. 

Wagon Rలో 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ పెట్రోల్+CNG ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ లీటరుకు మైలేజీ సుమారు 25.19 కి.మీ ఇస్తుంది. CNG వెర్షన్ ఒక కిలోకు సుమారు 34.05 కి.మీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి. దీనివల్ల సిటీస్, హైవేలలో వాగర్ ఆర్ సులభంగా నడపవచ్చు.

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti WagonR) ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది Android Auto, Apple CarPlayని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్,  341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ABS, EBD, ESP, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget