అన్వేషించండి

Jagan: కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం - బిల్లులు, బెట్టింగ్ బాధితుల భయమా ?

YSRCP: కార్యకర్తల వద్దకు వెళ్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకో వైసీపీ నేతలకు క్లారిటీ ఉంది. కానీ చెప్పడం లేదు.

Jagan announced that he will go to the activists, is now silent: చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న - భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు.  అందర్నీ కలుస్తానని వివరించారు.  జగన్ చెప్పిన తీరుతో  కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. 

కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేత

పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల అధ్యక్షుల్ని నియమించే ప్రయత్నం చేశారు. అయితే నియమితులైన చాలా మంది అట్టరహాసంగా ప్రమాణం చేశారు కానీ ఎవరూ యాక్టివ్ గా లేరు. కింది స్థాయి వరకూ పార్టీని నిర్మాణం చేయాలని జగన్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఓ లేయర్ లో కూడా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయలేదు. అదే సమయంలో సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. వారు సహకరించకపోతే కార్యకర్తలతో సమావేశాలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. 

ఆర్థిక సమస్యల్లో కార్యకర్తలు - జగన్ పై అసంతృప్తి 

వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గానికి వెళ్లినప్పుడు  కార్యకర్తలను కలవడానికే తంటాలు పడుతున్నారు. వచ్చిన వారంతా బిల్లులు సారూ అంటున్నారు.కోట్లు ఖర్చు పెట్టి పనులు చేశారు కానీ  ఇప్పుడు బిల్లులు రావడం లేదు. మరో వైపు పార్టీని నమ్ముకుని బెట్టింగులు కాసి నష్టోయామని ఆదుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారని ఇలాంటి వారు చేసే అలజడితో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అతి పార్టీకి మరింత డ్యామేజీ చేస్తుందన్న ఉద్దేసంతో  జగన్ ఆగిపోయారని అంటున్నారు. జగన్ ఎంతో కొంత సాయం చేస్తారని  కార్యకర్తల నుంచి ఇఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించిన తర్వాత జగన్  జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు . అధికారం వచ్చిన ఐదేళ్లలో జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదని ఇటీవల అంగీకరిస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తల కేసమే పని చేస్తానంటున్నారు. అయితే ఈ  ప్రకటనకు అంత కదలిక లేదని వైసీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి. 

ప్రభుత్వంపై ఇంకా అసంతృప్తి ప్రారంభం కాలేదన్న భావన

మరో వైపు ప్రభుత్వంపై ఎంతో కొంత అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమైతే.. జగన్ పర్యటనలకు స్పందన కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే   జగన్ పాలనపైనే ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతూండటంతో వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ఏదో జరిగిందని కూటమి ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ..దాన్ని తిప్పికొట్టాలని జగన్ పార్టీ నేతలకు అంటున్నారు. అంటే ప్రజలు ఇంకా కూటమి చెప్పేదే వింటున్నారి.. ఆ పరిస్థితి మారే వరకూ ఎదురుచూడటం మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జగన్ కార్యకర్తల్లోకి వెళ్లే అంశంపైనా  ముందూ వెనుకాడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget