అన్వేషించండి

Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!

Telangana Caste Survey: ఈ నెల16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలో మళ్లీ కుల గణన చేయనున్నారు. పాల్గోని వాళ్ల కోసమే అని చెబుతున్నా లెక్క వేరే ఉందని ప్రచారం సాగుతోంది.

Telangana Caste Survey: తెలంగాణలో కొద్ది రోజులుగా కుల గణన రచ్చ సాగుతోంది. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చెలరేగాయి. బీసీ కుల గణన చేసిన విధానం దేశంలో తెలంగాణ ఆదర్శమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్టుగా కుల గణన జరగలేదని తేలిపోయింది. కేసీఆర్ సర్కార్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు, రేవంత్ సర్కార్ చేసిన సర్వేకు మధ్య తేడాలు చర్చాంశనీయంగా మారాయి. 

కుల గణన జరిగిన తీరు ఇదే..
1931లో బ్రిటీష్ పాలకులు చేసిన కుల గణన సర్వే తర్వాత భారత దేశంలో కుల గణన సర్వే జరగలేదు. ఆ గణన ఆధారంగానే దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 75 సంవత్సరాల తర్వాత బిహార్‌లో 2021లో కుల గణన జరిగింది. అది జరిగిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఇచ్చిన హమీ మేరకు రేవంత్ ప్రభుత్వం బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపింది. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ,  పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

160 కోట్లతో శాస్త్రీయంగా సర్వే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే కోసం 1 లక్షా 3 వేల 889 మంది ఎన్యుమరేటర్లను వినియోగించారు. 1,15, 71, 457 కుటుంబాలను తెలంగాణలో గుర్తించగా ఎన్యుమరేటర్లు 1,12,15,134 కుటుంబాలను సర్వే చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కారణాలతో 3,56,323 కుటుంబాలను సర్వే చేయలేదు. తెలంగాణలో 96.9 శాతం సర్వే కవర్ అయినట్లు 3.1 శాతం సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబర్ ఆరున సర్వే ప్రారంభించి, 2025 డిసెంబర్ 25వ తేదీతో సర్వేను ముగించారు.

 ఈ సర్వేలో తెలంగాణ కులాల శాతం పరిశీలిస్తే..
ఎస్టీల జనాభా శాతం -  10.45
ఎస్సీల జనాభా శాతం - 17.43
మొత్తం ఓసీల జనాభా శాతం - 15.79
ముస్లిం మైనార్టీల జనాభా శాతం -  12.56 
ముస్లిం మైనార్టీలలో ఓసీ జనాభా శాతం - 2.48 శాతం
బీసీల జనాభా శాతం - 46.25 శాతం
ముస్లిం మైనార్టీలలో బీసీల శాతం - 10.08 శాతం
ముస్లిం మైనార్టీలు, బీసీలు కలుపుకుని మొత్తం జనాభా శాతం - 56.33

ఈ సర్వేపై వివాదం ఏంటంటే.. స్వపక్షంలో..
2014 నుంచి పదేళ్లలో అంటే ఈ ఏడాది 2024 వరకు చూస్తే బీసీలు, ఎస్సీ, ముస్లిం జనాభా తగ్గినట్లు, ఓసీ జనాభా మాత్రం పెరిగినట్లు రేవంత్ సర్కార్ చేసిన కుల గణన తేల్చింది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుల గణన సర్వే కాగితాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ,ఎస్సీ నేతలు సైతం దీనిపై గుర్రుగా ఉన్నారు.  ఓసీ జనాభా మాత్రమే ఎందుకు పెరిగింది , మిగతా సామాజిక వర్గాల జనాభా ఎలా తగ్గుతుంది. ఇదంతా ఓ కుట్ర లా జరిగిందన్న విమర్శలు వచ్చాయి.  దీనికి సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలది. ఈ కుట్ర కోణం వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారన్న చర్చ కాంగ్రెస్‌లో సాగింది. బీసీలకు అవకాశాలు లేకుండా చేసేందుకు ఓ వర్గం వారు కుట్ర పన్నారన్న ఆరోపణలు వచ్చాయి.  

విపక్షాల విసుర్లు.......
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాంగ్రెస్‌ను ఈ విషయంలో టార్గెట్ చేస్తూ తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముస్లిం మైనార్టీలకు లబ్ధి చేకూరేలా బీసీ జనాభా తగ్గించి మైనార్టీ సంఖ్య పెంచి చూపించాలని చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభాతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన సర్వేలో ఎలా తగ్గిందని ప్రశ్నలు గుప్పించారు. తిరిగి రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు సర్వేలో పాల్గొన లేదని రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు. 

Also Read: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !

హైకమాండ్...ప్రెజర్...
ఇలా కుల గణన విషయంలో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది. ఇది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిస్తే దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన జరిపి తీరతామని రాహుల్ గాంధీ ఇచ్చిన హమీ.  ఆ హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు బీసీల జనాభా తగ్గించి చూయించిననట్లు విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఆ వార్త పార్టీ హైకమాండ్ వరకు చేరిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇటు బీసీ కుల గణన రచ్చ, మరోవైపు ఎస్సీ వర్గకరణ విషయంలోను ఎమ్మార్పీఎస్ మందకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీ కంట్లో నలుసుగా మారాయి. ఈ వివాదాలు నడుస్తుండగానే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయింది. అందుకు రాష్ట్రంలోని ఈ పరిస్థితులే కారణమన్న చర్చ హస్తం నేతల్లో నడుస్తోంది. 

దిద్దుబాటు దిశగా....
ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ కుల గణన ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటే ఆ వ్యూహం బూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి కలిగింది. దీంతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇటీవలే జరిగిన మందకృష్ణ మాదిగతో రేవంత్ భేటీ అందులో భాగమని తెలుస్తోంది. మరోవైపు బీసీల ఆగ్రహాన్ని చల్చార్చేందుకు మరో దఫా కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల16 నుంచి 28వ తేదీ వరకు మరోమారు కులగణన చేయనున్నారు. అయితే 3.1 శాతం మంది ఈ గణనలో పాల్గొనలేదు. వారి కోసం ఇది చేపడుతున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 

Also Read: బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget