ఔషధ మొక్కల రసాయనాలతో అభిషేకం, మూలికా ప్రసాదం - పవన్ దర్శించుకున్న అగస్త్య మహర్షి ఆలయానికి దారి ఇదే!
Agastya Maharshi temple: సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం విశిష్టత ఏంటి? మిగిలిన ఆలయాలకు దీనికి వ్యత్యాసం ఏంటి?

Pawan Kalyan visits Agastya Maharshi temple in Kerala: సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తనయుడు అకీరా నందన్ తో పాటూ కొచ్చి సమీపంలో అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఫిబ్రవరి 12 ఉదయం అగస్త్య మహర్షి ఆలయం..సాయంత్రం తిరువనంతపురంలో పరశురామస్వామి ఆలయాన్ని సందర్శించారు.
పవన్ కళ్యాణ్ మొదటగా సందర్శించిన అగస్త్య మహర్షి ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా..
శివ పురాణం ప్రకారం...శివ పార్వతుల వివాహం సందర్భంగా దేవతలు, మహర్షులంతా కైలాస పర్వతానికి వెళ్లారు. ఆ సమయంలో భూమి ఒకవైపు వంగిపోయింది. దీంతో దక్షిణ దిశగా వెళ్లి భూమిని సమతుల్యం చేయమని శివుడు...అగస్త్యుడిని కోరాడు. అలా ఈ ప్రాంతానికి వచ్చిన అగస్త్యుడు ఈ ప్రదేశాన్ని ఇష్టపడి అక్కడే ఉండిపోయాడు.
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కురీకాడ్‌లో ఉంది అగస్త్య ఆలయం. వేద జ్ఞానం, ఆయుర్వేద వైద్యానికి నిలయం ఈ ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలో మొత్తం 13 చిన్న మందిరాలున్నాయి. మొత్తం వీటన్నింటినీ కలిపి అగస్త్యాశ్రమం అంటారు. ప్రధాన మందిరంలో అగస్త్య మహర్శి విగ్రహం కొలువుతీరి ఉంటుంది.
అన్ని ఆలయాల్లో మూలవిరాట్ కి ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. రుచికరమైన ఆహార పదార్థాలు నివేదించి వాటినే భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు. కానీ...అగస్త్య మహర్షి ఆలయంలో విగ్రహానికి ఔషధ మొక్కల రసాలతో అభిషేకం చేస్తారు. మరి ప్రసాదం సంగతేంటి అంటారా.. మూలికలతో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!
సైన్స్, సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానాలు అన్నీ వేదాల్లో స్పష్టంగా పేర్కొన్నవే. ఆ విధానాలనే అనుసరిస్తారిక్కడ. భారీ ఆలయాలు నిర్మాణం కన్నా వేద గురువుల గొప్పతనం తెలియజేసేలా ఈ ప్రాంగంణం ఉండాలని భావించారు. అందుకే ఈ ఆలయ సముదాయం నైమిశార్యాన్ని తలపిస్తుంది.
ఆలయ సముదాయంలో అగస్త్యులు, లోపాముద్ర , ఔషధ గణపతి, దేవతల వైద్యుడు ధన్వంతరి , జ్ఞాన మురుగన్, మార్కండేయుడు, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, అనసూయ దేవి, భృగు మహర్షి, అరుంధతి దేవి, వశిష్ట మహర్షి, నారద మహర్షి విగ్రహాలు దర్శించుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం మూలికా ఔషధం ప్రసాదంలా అందిస్తారు. అంటే ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందించే పవిత్ర ప్రదేశం.
కేరళ త్రివేండ్రంలో నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపలున్న ఎన్నో పర్వతాలలో అగస్త్యకూడం ఒకటి. ఇక్కడకు చేరేందుకు అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.. రోజుకి కేవలం 100 ఎంట్రీ పాస్‌లు మాత్రమే ట్రెక్కింగ్ కోసం జారీ చేస్తారు. యునెస్కోతో గుర్తింపు పొందిన అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ లో 2,000 కంటే ఎక్కువ జాతుల ఔషధ మొక్కలతో సహా అనేక అరుదైన , విభిన్నమైన వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తెగల్లో ఒకటైన కని తెగ వారు అగస్త్యమలై కొండల్లో నివసిస్తున్నారు.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
అగస్త్య మహర్షి ఆలయానికి, అగస్త్యమలై కొండల్లో ట్రెక్కింగ్ ఎక్కడకు వెళ్లాలన్నా బస్, ట్రైన్, ఫ్లైట్ మూడు అందుబాటులో ఉంటాయి. తిరువనంతపురం వరకూ ఫ్లైట్ లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అగస్త్య మహర్షి ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్లాలి అనుకుంటే కాచిగూడ → తిరునెల్వేలి కి ట్రైన్ వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారు వల్లీయూర్ దగ్గర దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవడం తేలికవుతుంది.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

