Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
Compassionate appointments in Telangana | తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని వందల కుటుంబాలకు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది.

Telangana Jobs | హైదరాబాద్: కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించే ముఖ్యమైన చర్యలో భాగంగా, తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ దాదాపు 560 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామకాలను ఆమోదించింది. తమ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తిని కోల్పోయిన కుటుంబాల దుస్థితిని హైలైట్ చేస్తూ, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) చైర్మన్ ఎం. జగదీష్, సెక్రటరీ జనరల్ ఎలూరి శ్రీనివాసరావు నిరంతర విజ్ఞప్తులు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఫలించిన TGEJAC పోరాటం..
ఈ కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడానికి సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా కారుణ్య నియామకాలు సులభతరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కారుణ్య నియామకాల నిర్ణయం.. సామాజిక సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. TGEJAC అసోసియేషన్ నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించడం ద్వారా, ప్రభుత్వం మరణించిన ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించింది. వారి మీదే ఆధారపడిన మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఆశాకిరంగా మారింది. కారుణ్య నియామకాల లక్ష్యాన్ని సాధించడంలో TEJAC నాయకత్వం ఎం. జగదీష్, ఎలూరి శ్రీనివాసరావు అవిశ్రాంత కృషి ఉందని కారుణ్య కుటుంబాలు చెబుతున్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కారుణ్య నియామకాల నిర్ణయం..
TGEJAC చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కారుణ్య నియామకాల నిర్ణయం ఇతర రాష్ట్రాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మాజీ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయడం ద్వారా వారి సేవల్ని ప్రభుత్వం గుర్తించినట్లు అయిందన్నారు. కారుణ్య నియామకాలు ప్రభావిత ఉద్యోగుల కుటుంబాల జీవితాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని అన్నారు. వారికి ఆర్థిక స్థిరత్వాన్ని, భద్రతను ఈ ఉద్యోగాలు తీసుకొస్తాయి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంకితభావాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేస్తుందన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

