War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
War 2 Movie: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అవెయిటెడ్ మూవీ 'వార్ 2' అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు.

NTR Hrithik Roshan War 2 Movie Release Date: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న అవెయిటెడ్ మూవీ 'వార్ 2' (War 2). ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొనగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
'వార్ 2' రిలీజ్ అప్పుడే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అయితే, ఇటీవల హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిందని.. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రిలీజ్ డేట్‌పై మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG
— Yash Raj Films (@yrf) March 16, 2025
యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ 'వార్ 2' మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై స్పందించిన సదరు నిర్మాణ సంస్థ.. 'ఇది తప్పకుండా చెప్పాల్సిందే. మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే మీరు దాన్ని అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. దీంతో అనుకున్న టైంకే సినిమా రిలీజ్ చేస్తున్నారని.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మరోసారి థియేటర్లలోకి 'బాహుబలి' - పదేళ్ల తర్వాత అదే రోజున థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు!
పవర్ ఫుల్ 'రా' ఏజెంట్‌గా ఎన్టీఆర్..?
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'వార్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా.. దీనికి సీక్వెల్‌గా వార్ 2 వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఈ మూవీలో ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా.. చెప్పిన సమయానికే మేకర్స్ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 'ఎన్టీఆర్‌నీల్' వర్కింగ్ టైటిల్‌తో మూవీ రూపొందుతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

