Arjun S/O Vijayanthi Teaser: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ Vs కొడుకు - ఈ తల్లీకొడుకుల కథేంటో?, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ చూశారా!
Nandamuri Kalyan Ram Movie: సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వస్తోన్న మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Nandamuri Kalyan Ram's Movie Teaser Released: నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram), సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanthi) ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/O Vijayanthi). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఆమె కొడుకుగా కల్యాణ్ రామ్ నటిస్తుండగా తాజాగా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై భారీగా హైప్‌ను పెంచేసింది.
అసలు అర్జున్ ఎవరు..?
'పదేళ్ల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు నా కొడుకు అర్జున్ కనిపిస్తాడు.' అంటూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి డైలాగ్‌తో మొదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నీతి నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్ వైజయంతి తన కొడుకు అర్జున్‌ను పోలీస్ ఆఫీసర్‌ను చేయాలని కలలు కంటుంది. నెక్స్ట్ తన బర్త్ డే గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ ఓ పోలీస్ డ్రెస్‌ను అతనికి అందిస్తుంది. అయితే, అర్జున్ పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా ఓ డాన్‌గా కనిపించబోతున్నట్లు మూవీ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
కల్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్ మూవీపై హైప్‌ను అమాంతం పెంచేశాయి. 'రేపటి నుంచి వైజాగ్‌ను పోలీసులు, నల్లకోట్లు కాదు ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి' అనే డైలాగ్‌తో అసలు అర్జున్ పోలీసా.. లేక డాన్ లేక పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్‌గా మారాడా.? అనే సస్పెన్స్ నెలకొంది. 'నేను డ్యూటీలో ఉన్నప్పుడు తప్పు చేసింది బంధువైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచేసింది. ప్రేమతో ఉన్న తల్లీ కొడుకులు ఎందుకు దూరమయ్యారు.?, తల్లి విధి నిర్వహణ, కొడుకు కోపం.. అసలు ఈ తల్లీకొడుకుల కథేంటో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Here is the teaser of #ArjunSonOfVyjayanthihttps://t.co/yShMexgt3g
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) March 17, 2025
'ఆమెను అమ్మా అని పిలుస్తా'
విజయశాంతిని 'అమ్మా' అని పిలుస్తానని.. హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. మా సినిమాలో ప్రేమగా ఉండే తల్లీ కొడుకులు ఎందుకు దూరమయ్యారు.?, మళ్లీ వారు ఎలా కలుసుకున్నారు.? అనేదే కథాంశమని వెల్లడించారు. 'ఈ సినిమాకు స్ఫూర్తి కర్తవ్యం. ఆ సినిమాలో విజయశాంతి రోల్‌కు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది.?' అన్న ఆసక్తికర పాయింట్‌తో స్టోరీని డెవలప్ చేశాం.' అని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ కాగా.. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీ వీరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల మీద అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

