News
News
X

Raksha Bandhan 2022: రక్షాబంధన్ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది

చమోలి జిల్లాలోని ఉర్గామ్ లోయలో ఉన్న బన్షీనారాయణ దేవాలయం ఏడాదికి ఓసారి తెరుచుకుంటుంది. అది కూడా కేవలం రక్షాబంధన్ రోజునే తెరుస్తారు. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఏంటంటే...

FOLLOW US: 

రక్షాబంధన్ కి సంబంధించి ఎన్నో కథలు,పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటి సంగతి పక్కనపెడితే కేవలం రక్షాబంధన్ రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ఉత్తరాఖండ్  చమోలి జిల్లా ఉర్గామ్ లోయలో ఉన్న బన్షీ నారాయణ్ ఆలయం ఇది. అలకనందానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం చుట్టూ ప్రకృతి కట్టిపడేస్తుంది. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్‌కు అతి సమీపంలో కొలువైఉన్నాడు బన్షీ నారాయణుడు. ఈ ఆలయంలో సందడంతా రాఖీ రోజు మాత్రమే ఉంటుంది. తలుపులు తెరిచి పూజలు చేసిన అనంతరం మహిళలు , బాలికలు రాఖీలకు పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం తర్వాత సోదరులకు రాఖీ కడతారు. 

శ్రీ మహావిష్ణువు వామనఅవతారంలో బలిచక్రవర్తి అనే రాక్షసరాజు అహంకారాన్ని భగ్నం చేసి పాతాళానికి తొక్కేస్తాడు. ఆ తర్వాత శ్రీహరి ఇక్కడే ద్వారపాలకుడిగా ఉండిపోతాడు. భర్తకోసం ఎదురుచూసిన లక్ష్మీదేవి వెతుక్కుంటూ హేడిస్ చేరుకుని బలిచక్రవర్తికి  రాఖీ కట్టి తన భర్తను తనతో పాటూ తీసుకెళ్లిపోతుంది. స్వామివారు ద్వారపాలకుడిగా ఉండిపోయిన ఆ ఆలయాన్ని అప్పటి నుంచి ఏడాదికోసారి రక్షాబంధన్ రోజు తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. మిగిలిన రోజులన్నీ నారదమహాముని వచ్చి పూజలు చేస్తారని చెబుతారు. చమోలిలో ఉన్న ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. గోపేశ్వర్ నుంచి ఉర్గాం లోయకు కారులో చేరుకోవాలి. దీనిని దాటిన తర్వాత దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. వందల ఏళ్ల క్రితంనాటి ఆలయం, ఏడాదికోసారి తెరిచే ఈ ఆలయానికి చేరుకోవాలంటే కష్టపడాల్సిందే అంటారు భక్తులు. 

Also Read: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

మొదటి రాఖీ కట్టించుకున్న ఇంద్రుడు
పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి...దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి.

సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు జపించాల్సిన రక్షా బంధన్ గురించి ఒక ప్రత్యేక మంత్రం కూడా ఉంది. 

రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి
యేన్ బద్దో బలి రాజు, దాన్వేంద్రో మహాబలః.
టెన్ త్వం ప్ర బచామి రాక్షసే, మా చల్ మా చల్.

 "పది త్వమనుబధ్నామి రక్ష మా చల్ మా చల్".. మంత్రాన్ని జపించాలి.

అంటే మహాబలవంతుడైన రాక్షసరాజు బలి చక్రవర్తి ఏ రక్షాబంధన్‌కి కట్టుబడ్డాడో అదే రక్షాబంధన్‌తో నేను నిన్ను కట్టివేస్తున్నాను. అది నిన్ను రక్షిస్తుందని అర్థం. ఈ మంత్రం పఠిస్తే మీ సోదరుడిపై దుష్ట శక్తుల ప్రభావం పడదు. అనుకున్న పనుల్లో విజయం దక్కుతుంది.

Also Read: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Published at : 11 Aug 2022 11:25 AM (IST) Tags: raksha bandhan 2022 Chamoli Banshinarayan Temple Happy Rakhi Pournami 2022

సంబంధిత కథనాలు

Navratri 2022: పార్వతి ముచ్చటపడిందని చంద్రుడిని తీసి అలంకరించిన శివుడు, నవదుర్గల్లో మూడవది చంద్రఘంట

Navratri 2022: పార్వతి ముచ్చటపడిందని చంద్రుడిని తీసి అలంకరించిన శివుడు, నవదుర్గల్లో మూడవది చంద్రఘంట

Horoscope Today 28th September 2022: నవరాత్రుల్లో మూడోరోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి,సెప్టెంబరు 28 రాశిఫలాలు

Horoscope Today 28th September 2022: నవరాత్రుల్లో మూడోరోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి,సెప్టెంబరు 28 రాశిఫలాలు

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

టాప్ స్టోరీస్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?