News
News
X

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Raksha Bandhan Shubh Muhurt 2022: చాలా ప్రత్యేకదినాల్లా రక్షా బంధన్ కూడా పాశ్చాత్య పండుగల్లో భాగమే అనుకుంటే పొరపాటే. భాగవతం, భవిష్యపురాణం లాంటి గ్రంధాల్లోనూ రాఖీ ప్రస్తావన ఉంది.

FOLLOW US: 

Raksha Bandhan Shubh Muhurt 2022: పురాణకాలం నుంచి ప్రారంభమైన ఈ రాఖీ పండుగకు కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు.రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు దేశమంతా సోదర భావం ఉప్పొంగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సోదరుడు వర్థిల్లాలని సోదరి రాఖీ కడితే.. ఎల్లవేళలా నీకు అండగా నేనున్నా అని సోదరుడు భరోసా ఇస్తాడు.  

ఇంద్రాణి ప్రారంభించిన రక్షాబంధన్ 
పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి...దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి.

Also Raed: ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?

ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం
భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రాన్ని వదిలే క్షణంలో చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది. అన్నగా భావించి ఆదుకున్నందుకు అండగా ఉంటానని చెప్పిన కృష్ణుడు.. ఎలాంటి ప్రమాదం వచ్చినా తలుచుకో  అని అభయమిచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని మరో కథనం. ఇచ్చిన మాట ప్రకారం... కురు సభలో అవమానానికి గురైన ద్రౌపదిని ఆదుకున్నాడు శ్రీకృష్ణుడు.

సంతోషిమాత ఆవిర్భావం 
శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసి, తమకి కూడా సోదరి కావలిసినదేనంటూ ఆయన కుమారులు పట్టుబట్టారట.అప్పుడు వినాయకుడి సంకల్పంతో ఆయన కళ్లనుంచి 'సంతోషిమాత' ఆవిర్భవించినదని చెబుతారు. ఈ రోజున రాఖీ పండుగ జరుపుకునే వారిపై సంతోషిమాత దీవెనలు ఉంటాయంటారు.

శ్రీ మహాలక్ష్మి-బలిచక్రవర్తి
రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు

Also Raed:రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

చరిత్రలోనూ రాఖీ పండుగ:
పురాణాలు, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు.... రాఖీ సంప్రదాయం మన చరిత్రలోనూ కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో, అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ రాఖీని పంపిందట. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు. 
మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపిందని చరిత్ర చెబుతోంది. 
రవీంద్రనాథ్ టాగూర్ సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట.

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. 

Published at : 09 Aug 2022 01:02 PM (IST) Tags: raksha bandhan raksha bandhan 2022 Happy Raksha Bandhan 2022

సంబంధిత కథనాలు

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Dussehra 2022: ఈ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే దారిద్ర్యమంతా తీరిపోతుంది!

Dussehra 2022: ఈ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే దారిద్ర్యమంతా తీరిపోతుంది!

Weekly Horoscope 2022 September 25 to October 1: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి

Weekly Horoscope 2022 September 25 to October 1: ఈ వారం ఈ రాశులవారికి స్థిరాస్తి వ్వవహారాలు కలిసొస్తాయి

Horoscope Today 25th September 2022: ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today 25th September 2022:  ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'