అన్వేషించండి

Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నో డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

Central Government: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతులకు సంబంధించి నాన్ డిటెన్షన్ విధానం రద్దు చేసింది. దీని ప్రకారం ఈ విద్యార్థులు పాస్ కాకుంటే మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది.

Central Government Suspended Non Detention Policy: పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో 'నో డిటెన్షన్ విధానం' (No Detention Policy) రద్దు చేసింది. ఈ క్రమంలో ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంది. ఒకవేళ పాస్ కాకుంటే విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో కొనసాగాల్సి ఉంది. విద్యా హక్కు చట్టం - 2019కు చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు మినహా 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ 2 తరగతులకు సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని పేర్కొంది.

2 నెలల్లో మళ్లీ ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి 2 నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ విద్యార్థి ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు అదే తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తైనంత వరకూ ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని.. కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు, పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం కనుక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని.. ఇప్పటికే 16 రాష్ట్రాలు, ఢిల్లీ సహా 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ 2 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగిలిన రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ విధానంపై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 'నో డిటెన్షన్ విధానం' కొనసాగుతోంది.

Also Read: Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Medicine Price Hike: 900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
Mega 157 Update: అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ameer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP DesamMumbai Indians Ashwani Kumar | బుమ్రా నుంచి అశ్వనీ వరకూ ముంబై టాలెంట్ హంట్ కి హ్యాట్సాఫ్ | ABP DesamMI Bowler Ashwani Kumar Biography | IPL 2025 లో సంచలన అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్ | ABP DesamAshwani Kumar 4 Wickets vs KKR | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో డెబ్యూ చేసిన అశ్వనీ కుమార్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR slams Rahul Gandhi: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ- ఈ దారుణాలపై రాహుల్ గాంధీ స్పందించరా?: కేటీఆర్
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
HCU Lands Issue: కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోండి, కేంద్ర మంత్రిని కోరిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
Medicine Price Hike: 900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
900 రకాల మెడిసిన్ ధరలు పెంచిన కేంద్రం, నేటి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు
Mega 157 Update: అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU Lands Issue: ఆ 400 ఎకరాల భూములపై హైకోర్టులో పిటిషన్, రేపు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
ఆ 400 ఎకరాల భూములపై హైకోర్టులో పిటిషన్, రేపు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
NTR Neel Movie: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్... నీల్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసిందోచ్
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్... నీల్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసిందోచ్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Embed widget