Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Pongal Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్ వేస్తోంది రైల్వేశాఖ. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి ఎప్పుడూ వినని రూట్ లలో సైతం ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో విపరీతంగా ఉండే రాష్ట్రంవిపరీతంగా ఉండే రష్ ను క్లియర్ చేయడం కోసం మరో 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ఓవరాల్ గా 600 ప్రత్యేక రైళ్లను పండుగ కోసం నడుపుతామన్న రైల్వే ఇప్పుడు క్రొత్తగా మరో 11 రైళ్లను ప్రకటించడం విశేషం. అయితే ఈ ప్రత్యేక రైళ్లను పూర్తిగా న్యూ రూట్స్ లో నడపనుంది.
07460- కాకినాడ -వికారాబాద్
08.01.2026 న కాకినాడ లో సాయంత్రం 06:20 కి బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. మధ్యలో సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు,ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల లో ఆగుతుంది.
07461- వికారాబాద్ -పార్వతీపురం
ఈ ట్రైన్ 09.01.2026,11.09.2026 తారీఖుల్లో వికారాబాద్ నుండి రాత్రి 08:30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 02:30కి పార్వతీపురం చేరుకుంటుంది. మధ్యలో లింగంపల్లి, బేగంపేట్,సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజిపేట్, వరంగల్, ఖమ్మం,రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, ఎలమంచిలి,అనకాపల్లి, దువ్వాడ,కొత్తవలస,విజయనగరం, బొబ్బిలి స్టేషన్ల లో ఆగుతుంది.
07462- పార్వతీపురం -వికారాబాద్
ఈ ట్రైన్ 10.01.2026న సాయంత్రం 06:30కి పార్వతీపురం లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30కి వికారాబాద్ చేరుకుంటుంది. మధ్యలో బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట,అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు,ఖమ్మం, వరంగల్, ఖాజిపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్ల లో ఆగుతుంది.
07463- పార్వతీపురం- కాకినాడ
12.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురం లో బయలుదేరే ఈ ట్రైన్ 13.01.2026 అర్ధరాత్రి 1గంటకు కాకినాడ చేరుతుంది. మధ్యలో బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట స్టేషన్ల లో ఆగుతుంది
07464- సికింద్రాబాద్, పార్వతీపురం
08.1.2026న రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30కి పార్వతీపురం చేరుకుంటుంది. దారిలో చర్లపల్లి, ఖాజిపేట్,వరంగల్, ఖమ్మం, రాయనపాడు,ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట,ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ,పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి స్టేషన్ల లో ఆగుతుంది
07465 పార్వతీపురం -సికింద్రాబాద్
09.01.2026న సాయంత్రం 6:30కి పార్వతీపురం లో బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. మధ్యలో బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం,వరంగల్,ఖాజిపేట్,చర్లపల్లి స్టేషన్ల లలో ఆగుతుంది.
07186 -కాకినాడ - వికారాబాద్
07.01.2026,09.01.2026 తేదీల్లో కాకినాడ లో సాయంత్రం 4:45కి బయలుదేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 7గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.మధ్యలో సామర్లకోట, అనపర్తి,రాజమండ్రి,ఏలూరు, విజయవాడ,గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ,చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.
07185- వికారాబాద్ -కాకినాడ
ఈ ట్రైన్ 08.01.2026 న వికారాబాద్ లో సాయంత్రం 05:35కి బయలుదేరి తరువాతి రోజు ఉదయం 8:30కి కాకినాడ చేరుకుంటుంది. దారిలో లింగంపల్లి, బేగంపేట్,సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ,గుంటూరు, విజయవాడ,గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, ద్వారపూడి,సామర్లకోట స్టేషన్ల లో ఆగుతుంది.
07187- వికారాబాద్ -కాకినాడ
ఈ రైలు 10.01.2026 న సాయంత్రం 7గంటలకు వికారాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కాకినాడ చేరుతుంది. మధ్యలో లింగంపల్లి, బేగంపేట్,సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ,గుంటూరు, విజయవాడ,గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, ద్వారపూడి,సామర్లకోట స్టేషన్ల లో ఆగుతుంది.





















