Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Emmanuel Reaction : బిగ్ బాస్ హౌస్ ఎక్స్‌పీరియన్స్‌ను లైఫ్ లాంగ్ తన గుండెల్లో పెట్టుకుంటానని ఇమ్మాన్యుయెల్ అన్నారు. తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Emmanuel About His Experience In Bigg Boss House : 'జబర్దస్త్' షో ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఇమ్మాన్యుయెల్. పలు షోల్లోనూ తన కామెడీతో ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో తనదైన గేమ్‌తో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్‌గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఇమ్మూ తెలిపాడు. హౌస్‌లో ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
'గుండెల్లో పెట్టుకుంటా'
బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. తన సహ పార్టిసిపెంట్స్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని చెప్పాడు. 'హౌస్‌లో ప్రతీ ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారు. కానీ గంటలు, రోజులు, వారాల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.
హౌస్ జర్నీలో నాకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా 'విజనరీ వౌస్'కి కృతజ్ఞతలు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలు నా కెరీర్, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తాను. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్‌కు కంగ్రాట్స్. నాకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదు.' అని అన్నాడు.
Also Read : అల్లు శిరీష్ నయనిక పెళ్లి డేట్ ఫిక్స్ - 'బాబాయ్ నీ పెళ్లి ఎప్పుడు?' అంటే...
విన్నర్‌తో ఈక్వెల్‌గా...
బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ అందరి ఫేవరెట్‌గా నిలిచాడు. తన గేమ్‌తో చాలా మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కమెడియన్‌గా అడుగుపెట్టి హీరోగా నిలిచాడంటూ బిగ్ బాస్ కూడా అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సీజన్‌లో ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమ్మాన్యుయెల్ కావడం విశేషం. హౌస్‌లో అందరికీ ఆనందం పంచుతూ తన వారు తప్పు చేసినా నిలదీశాడు. టాప్ 4వ స్థానంలో నిలిచాడు.
ఇమ్మాన్యుయెల్ 15 వారాల పాటు కొనసాగగా... వారానికి రూ.2.6 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా రూ.40 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది విన్నర్ కల్యాణ్ కంటే ఎక్కువే. ఈ సీజన్‌లో భరణి, సంజనలు రెమ్యునరేషన్లలో టాప్‌లో ఉన్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ ట్రోఫీని కామనల్ కల్యాణ్ పడాల సొంతం చేసుకోగా రన్నర్‌గా తనూజ నిలిచారు.





















