అన్వేషించండి
Bhagavad Gita: భగవద్గీతలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాలు - వాటి అర్థాలు ఇవే!
Bhagavad Gita:కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినదే భగవద్గీత. మొత్తం చదివారా..లేదంటే.. ఈ కొన్ని శ్లోకాలు చదువుకున్నా భగవద్గీత ఆంతర్యం మీకు అర్థమవుతుంది..

Bhagavad Gita (Image Credit: Pinterest)
1/7

శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులు, బంధువులు, గురువులు, స్నేహితులని చూసి అర్జునుడి హృదయం వికలమైంది. రాజ్యం కోసం వారిని వధించలేనని బాధపడతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.
2/7

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి || నీకర్మలను నువ్వు ఆచరించు...నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాన్ని ఆశించి ఎట్టిపరిస్థితుల్లోనూ కర్మలు చేయవద్దు..అలాగని కర్మలు చేయడం మానకు..
3/7

వాసంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి| తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ|| చినిగిన వస్త్రాలు విడిచిపెట్టి కొత్త దుస్తులు ఎలా ధరిస్తామో..జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మకూడా మరో దేహంలోకి ప్రవేశిస్తుంది..
4/7

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి కోపం వల్ల అవివేకం వస్తుంది..అవివేకం వల్ల మతిమరుపు..మతిమరుపుతో బుద్ధినాశనం..దాంతో మనిషే నాశనం అవుతాడని అర్థం..
5/7

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార | ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: || చేసే పనిని పూర్తిచేయండి..పదే పదే దాని ఫలితంపై ఆసక్తి ఉండకూడదు. కర్మ ప్రకారం మీరు ఆచరించాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి..
6/7

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ| యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ || పొగతో నిప్పు...ధూళితో అద్దం..మావితో గర్భస్థ శిశువు కప్పి ఉన్నట్టే ..కామం జ్ఞానాన్ని కప్పేస్తుంది..
7/7

ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ లేకపోవచ్చు..అలాంటి వారికోసమే ఈ కొన్ని శ్లోకాలు..
Published at : 11 Dec 2024 11:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion