అన్వేషించండి

Krishna Janmashtami 2021: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

శ్రీకృష్ణ ఆలయాల్లో నాలుగింటిని ప్రధానంగా చెప్పుకుంటాం. ఉత్తరప్రదేశ్-మథుర, గుజరాత్-ద్వారక, కేరళ- గురువాయూరు, కర్ణాటక-ఉడిపి. వీటిలో స్వయంగా రుక్మిణి విశ్వకర్మతో తయారుచేయించిన విగ్రహం కొలువైన ఆలయం ఉడిపి.

ఉడిపిలో స్వామివారు బాలుని రూపంలో కొలువై ఉండండ వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా అటుగా వస్తున్న ఓ నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో మధ్వాచార్యులు తన ఉపవస్త్రాన్ని (కండువా) విసిరి ఆ నావను ఒడ్డుకి చేర్చారు. నావలోని వారంతా కిందకు దిగి స్వామివారికి నమస్కరించి… నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు ఉన్నాయి… అవి ఇవ్వమని అడిగారు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకూపనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు. అప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టంతా కరిగి లోపల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు బయటపడ్డాయి.

Krishna Janmashtami 2021:  రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

ఈ విగ్రహాలకున్న ప్రాముఖ్యత ఏంటంటే… ఒకసారి దేవకీదేవి కృష్ణునితో నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టు తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలసి ఆడుకున్నాడు. బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకితో పాటూ రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణి దేవి విశ్వకర్మ ను పిలిచి వారి రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది.  కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో కలిసింది. ఆ తర్వాత కాలంలో ఇలా మధ్వాచార్యుల చెంతకు చేరిన కృష్ణుని విగ్రహం ఇప్పుడు ఉడిపిలో పూజలందుకుంటోంది.

Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం

ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే మధ్వాచార్యులు ఆరోజు తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తన శిష్యులతో ప్రక్షాళన చేయించి… తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం… మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచీ మధ్వాచార్యులు అవలంభించిన పూజా విధానాన్నే అనుసరిస్తున్నారు.

Krishna Janmashtami 2021:  రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

Also read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలిచే ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం.  నిమ్నజాతికులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చినట్టు స్థలపురాణం. అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపం నిర్మించారు. ఉత్సవాలు, పండుగల సమయంలో ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

Krishna Janmashtami 2021:  రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కొయ్యశిల్పాలు… ఇవన్నీ భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లిపోతాయి. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం,  దానికి సమీపంలో తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకలపొడి తదితరాలను ఉంచుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు.

కృష్ణ పరమాత్మ భక్తుడైన మధ్వాచార్యులు కృష్ణతత్వ వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో తన ఎనిమిది మంది శిష్యుల కోసం 8 పీఠాలను ఏర్పాటు చేశారు. పిజ్జావారు, కుటికి, పాలిమర్, క్రిష్ణపుర , సిరూర్కానీ, ఎవరుసోదే, ఆడవారు, అనే ఎనిమిది మఠాలను మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు వీటిని అష్ట పీఠాలు అని అంటారు. దేవాలయంలో పూజలు ఇతర వ్యవహారాలను ఈ అష్టాదశ పీఠాలు చూసుకుంటాయి. దేవాలయం బాధ్యతలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో పీఠం చూసుకుంటుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవాలలో బాధ్యతల మార్పిడి జరుగుతుంది. మకర సంక్రాంతి, హనుమాన్ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, మహాశివరాత్రి మహోత్సవం, దసరా, నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి, ఇలాంటి పండుగలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.

Krishna Janmashtami 2021:  రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

కృష్ణ తత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతునన ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుదీరి ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా భక్తులు దర్శించుకుంటూ తన్మయత్వాన్ని పొందుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Puthalapattu Assembly Constituency: పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Puthalapattu Assembly Constituency: పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. పట్టు సాధించేదెవరు..?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Embed widget