Adilabad Tribals Vetti Festival | కొలాం ఆదివాసీలు ఎక్కడున్నా..ఏడాదిలో ఓసారి ఇలా చేస్తారు | ABP Desam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలాం తెగకు చెందిన ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏటా వెట్టి అనే సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వెట్టి అంటే ఒకరోజు ఉచితంగా పనిచేయడం.. తమ ఆచార సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా పూర్వకాలం నుండి వస్తున్న ఆచార కట్టుబాట్లకు అనుగుణంగా కొలాం ఆదివాసి గ్రామాల్లో గ్రామ పెద్ద అనగా గ్రామ పటేల్ మరియు గ్రామ పూజారి ఈ ఇద్దరి వ్యవసాయ క్షేత్రాల్లో గ్రామ మహిళలు ఏడాదికోసారి ఉచితంగా కలుపుతీత తీస్తారు. ఏంటి ఇది విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా..? అవును నిజమే..! గ్రామ పటేల్ మరియు పూజారి అనగా దేవారి వారి కష్టసుఖాల్లో ఏడాది పాటు పాలుపంచుకుంటూ వారి సుఖదుఃఖాల్లో ముందు వెనుక ఉండి నడుస్తారు. అలాగే గ్రామంలోని అందరి సంరక్షణతో పాటు పూజలు వారి ఎలాంటి సమస్యలు ఉన్నా, అలాగే పెళ్లిళ్ల సంబంధాలు ఇతర కార్యక్రమాలకు ముందుండి అన్ని తామై నడుస్తారు. కాబట్టి వారికి తమ సంస్కృతి ఆచార సంప్రదాయంలో భాగంగా ఒకరోజు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇలా "వెట్టి" అనే సాంప్రదాయాన్ని కొలాం ఆదివాసులు నిర్వహిస్తుంటారు.





















