అన్వేషించండి

Online Gaming Ban: బెట్టింగ్ యాప్స్‌కు దిబిడి దిబిడే- ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలపై దృష్టి పెడుతుంది. కొత్త బిల్లులో ఆన్లైన్ గేమింగ్ నిషేధం ఉంది.

 Online Gaming Bill:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను శిక్షార్హమైన నేరంగా మారనుంది. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ద్వారా ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రిస్తారు. ఈ చర్యతో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. దీంతో గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత, నియంత్రణ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కొత్త బిల్లులో కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే నిబంధనలను కూడా చేర్చారు. అంటే వ్యసనం, ఆర్థిక నష్టం లేదా సమాజంలో అశాంతిని ప్రోత్సహించే గేమ్‌లను నిషేధించవచ్చు.

గేమింగ్ పరిశ్రమపై ప్రభావం

ఈ బిల్లు ఉద్దేశ్యం ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో నియమాలను నిర్ణయించడం, వినియోగదారులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం. ప్రస్తుతం, గేమింగ్ కంపెనీలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వల్ల వినియోగదారులు తరచుగా దోపిడీకి గురవుతున్నారు. మోసాలకు గురవుతున్నారు.

కొత్త చట్టం వచ్చిన తర్వాత, కోట్ల మంది వినియోగదారులు చురుకుగా ఉన్న భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎటువంటి నిబంధనలు లేకుండా వర్చువల్ మనీ, రియల్ క్యాష్ గేమ్‌లు లేదా బెట్టింగ్‌కు సంబంధించిన గేమ్‌లను నడుపుతున్న కంపెనీలు తమ విధానాలను మార్చుకోవాలి.

ఏయే గేమ్‌లపై నిషేధం విధించవచ్చు?

జూదం లేదా బెట్టింగ్‌ను ప్రోత్సహించే గేమ్‌లను నిషేధించే నిబంధన బిల్లులో ఉంది. వర్చువల్ మనీ లేదా రియల్ క్యాష్ బెట్టింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆటగాళ్ల వ్యసనాన్ని పెంచే గేమ్‌లు,  ఆర్థికంగా నష్టాన్ని కలిగించే గేమ్స్‌పై కొరడా ఝలిపించనున్నారు. హింసాత్మక లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. రూల్స్ పాటించకుండా సమాజంపై ప్రభావం చూపే  ఇలాంటి గేమ్‌లను నడుపుతున్న కంపెనీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ దాదాపు 3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది.  అటువంటి పరిస్థితిలో, కొత్త చట్టం నిజమైన కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో, పరిశ్రమ ఇప్పుడు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో ప నిచేయడం వల్ల విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా పెరుగుతుంది.

దీంతోపాటు రాజస్థాన్‌లోని కోట-బుండిలో రూ.1507 కోట్లతో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కటక్ -భువనేశ్వర్‌ మధ్య ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "రాజస్థాన్‌లోని కోట-బుండి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ టెర్మినల్ భవనం 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 3200 మీటర్ల పొడవైన రన్‌వేతో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులు ఉంటారు. 2 సంవత్సరాలలోపు దీన్ని పూర్తి చేయడమే లక్ష్యం. "2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. గత 11 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది" అని అన్నారు. "ఇప్పుడు భారతదేశంలో 162 క్రియాశీల విమానాశ్రయాలు ఉన్నాయి."

కోటా-బుండి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "కోటా ఒక పారిశ్రామిక, విద్యా కేంద్రం. విద్యా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కోటాను క్రమం తప్పకుండా సందర్శిస్తారు. ఇక్కడ విమానాశ్రయం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఉన్న విమానాశ్రయం పాతది. అందుతే అప్‌డేట్‌ అవసరం."

ఒడిశాలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM)లో రూ. 8,307.74 కోట్ల వ్యయంతో 6-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగ్ రోడ్ (భువనేశ్వర్ బైపాస్ - 110.875 కి.మీ) నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. "ఈ ప్రాజెక్టును 6-లేన్ యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేగా అభివృద్ధి చేయాలని  ప్రతిపాదన ఉంది. ఇది కటక్, భువనేశ్వర్, ఖోర్ధా నగరాల్లో నివసించే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget