Asia Cup 2025 Surya Kumar Yadav | కెప్టెన్ గా రాణిస్తున్నా..ఆటగాడిగా ఫెయిల్ అవుతున్న SKY | ABP Desam
మంగళవారం టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ కోసం టీమిండియా ను ప్రకటించనున్నారు. అయితే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతోంది కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. రీజన్ టీ20ల్లో ఇటీవల సూర్య కుమార్ యాదవ్ ఉన్న ఫామ్. అచ్చం ఏబీ డివిలియర్స్ లా గ్రౌండ్ లో నాలుగు వైపులా షాట్స్ ఆడుతూ మిస్టర్ 360 గా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్ యాదవ్ టీ20ల్లో టీమిండియా కు కెప్టెన్ గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను కెప్టెన్ అయ్యాక ఆడిన 15 టీ20ల్లో 13 మ్యాచ్ లు గెలిపించిన సూర్య కుమార్ యాదవ్...టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత ఇప్పటివరకూ నాలుగు సిరీస్ ల్లో భారత్ కి ఓటమి అనేదే ఎదురు అవ్వనివ్వలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి జట్లను టీమిండియా ఓడించి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే కెప్టెన్ గా సూర్య ఇంత అద్భుతంగా రాణిస్తున్నా అతడికి ఈ ఆసియా కప్ చావో రేవో కావటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్. కెప్టెన్ అవ్వటానికి ముందు వరకూ టీ20ల్లోనే సూర్య కుమారే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్. ప్రత్యర్థి ఎవ్వరిని చూడకుండా బౌలర్లపై విరుచుకుపడేవాడు. కానీ కెప్టెన్ అయ్యాక బ్యాటర్ గా సూర్య వైఫల్యాలు మొదలయ్యాయి. తను కెప్టెన్సీ చేసిన 15 టీ20ల్లో SKY బ్యాటర్ గా సాధించిన పరుగులు 258. యావరేజ్ కేవలం 18.42 మాత్రమే. ఇప్పుడున్న కుర్రాళ్ల పోటీని తట్టుకుని నిలబడాలంటే సూర్య నిలబడాలంటే ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు. రెండోది సూర్య కుమార్ యాదవ్ వయస్సు 34 సంవత్సరాలు. చాలా సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడి చాలా లేట్ గా టీమిండియా కు సెలెక్ట్ అయిన స్కై భవిష్యత్తు దృష్ట్యా కుర్రాళ్లు ఆడే టీ20 ఆట నుంచి తప్పుకోవాలనేది ఓ ప్రతిపాదన. సో కెప్టెన్ గా విజయాలు సాధిస్తున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సూర్య కుమార్ యాదవ్ ఈ ఆసియా కప్ లో బ్యాటర్ గా రాణించకపోతే తనపై కోచ్ గంభీర్ కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.





















