అన్వేషించండి
Sri Padmavathi Ammavari Brahmotsavalu: సూర్యప్రభ వాహనంపై వెలిగిపోతున్న సిరులతల్లి ..రాత్రి చంద్రప్రభ వాహనంపై పద్మావతి అమ్మవారు!
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు

Sri Padmavathi Ammavari Karthika Brahmotsavam
1/9

సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారిఅయిన శ్రీ కృష్ణుడి రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు
2/9

మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు.
3/9

బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ కన్నులపండువగా సాగింది
4/9

లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగుతున్నాడని పురాణాల్లో ఉంది. సూర్యుడి కిరణాలు తాకి పద్మాలు వికలిస్తాయి.. ఆ పద్మాలే లక్ష్మీ నివాసాలు
5/9

సూర్యప్రభ వాహనంలో అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు సిద్ధిస్తుందని పండితులు చెబుతారు
6/9

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 9 వరకూ శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు
7/9

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.
8/9

సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరిస్తారు.
9/9

ఎనిమిదో రోజు రాత్రి పద్మావతి అమ్మవారు అశ్వవాహనంపై విహరిస్తారు
Published at : 04 Dec 2024 11:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion