ఈ రోజు రాఖీ కడుతున్నారా, భద్రకాలం గురించి తెలుసా మరి



పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి



శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందని విశ్వసిస్తారు



భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది



అందరి పనులూ అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుంది భద్ర



భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని చెబుతారు. ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవు. జరిగినా మంచిది కాదు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు.



ఈ ఏడాది ఆగస్టు 11 గురువారం రోజున భద్రకాలం ఉంది



భద్రకాలంలో రాఖీ కట్టడం వల్ల శుభం కన్నా అశుభం జరుగుతుందని అందుకే ఆగస్టు 12 శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు పండితులు.



మరీ ప్రత్యేక పరిస్థితుల్లో అయితే ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల వరకు కూడా రాఖీ కట్టొచ్చు.



ఫైనల్ గా చెప్పుకుంటే మాత్రం ఆగస్టు 12 వ తేదీనే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలన్నది పండితుల మాట...



Image Credit: Pinterest