ABP Desam

ఆగస్టు 11 రాశిఫలాలు


ABP Desam


మేషం
ఈ రోజు ఈ రాశివారికి అద్భుతంగా ఉంది. వ్యాపారులు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ పరిచయాలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


ABP Desam


వృషభం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రణాళికలు అమలు పరుస్తారు. అనవసర సంబంధాలను ఇకనైనా వదిలించుకోవడం మంచిది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు.


ABP Desam


మిథునం
మీ తల్లిగారి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. పెద్దల మాట సావధానంగా వినండి. ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిమ్మల్ని ఎవ్వరైనా తొందరగా ఇష్టపడతారు.


ABP Desam


కర్కాటకం
ఈ రోజు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరమైన పనులు సజావుగా సాగుతాయి. కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది.. తోబుట్టువులు, పెద్దలతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.


ABP Desam


సింహం
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. రోజువారీ పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి.కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉధ్యోగులు, వ్యాపారులకు మంచిరోజు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి.ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


ABP Desam


కన్య
ఈ రోజు మీకు ఫ్రెష్ గా ప్రారంభమవుతుంది.ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఆదాయవనరులు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.


ABP Desam


తుల
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి సమస్య పెరుగుతుంది. జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు దాచడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వీడాలి.ఆర్థిక ఇబ్బందులుంటాయి.


ABP Desam


వృశ్చికం
ఈ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభాలు ఉండొ చ్చు. అనుకున్న ప్రణాళికలు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. మీ అభిప్రాయాలను ఎదుటివారు ఏకీభవించేట్టు చేయడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు మంచి సమయం. వ్యాపారాలు బాగా సాగుతాయి.


ABP Desam


ధనుస్సు
కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడుల గురించి ఈ రోజు ఆలోచించకపోవడమే మంచిది. మీరు ఏ పని అనకుంటారో అది పూర్తిచేయండి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.


ABP Desam


మకరం
ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీకు అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.


ABP Desam


కుంభం
ఎప్పటి నుంచో వెంటాడుతున్న కష్టాలు తీరుతాయి. పిల్లలు, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. స్నేహితులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


ABP Desam


మీనం
మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన చిన్న విషయాలపై శ్రద్ధ చూపకపోతే వారు దాన్ని చెడుగా భావించవచ్చు. ఉద్యోగులకు పనిపట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా కాలం తర్వాత మీ స్నేహితుడిని కలవాలనుకుంటారు. వ్యాపారం బాగానే ఉంటుంది.