ABP Desam


రక్షా బంధన్ శుభముహూర్తం ఇదే


ABP Desam


మీరు ఏ రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు? ఆగస్టు 11 గురువారమా లేదా ఆగస్టు 12 శుక్రవారమా?


ABP Desam


ఆగస్టు 11 గురువారం ఉదయం దాదాపు 10 గంటలకు ప్రారంభమైన పౌర్ణమి ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 7.39 వరకూ ఉంది


ABP Desam


పౌర్ణమి కదా చంద్రుడి లెక్క అని కొందరు, సూర్యోదయం తిథి లెక్క మరికొందరు. దీంతో రాఖీ గురువారం కొందరు, శుక్రవారం మరికొందరు జరుపుకుంటున్నారు


ABP Desam


క్యాలెండర్ ప్రకారం రాఖీ పౌర్ణమి ఆగస్టు 11 గురువారం ఉంది. అయితే పండితులు చెప్పేదేంటంటే తెలుగు పండుగలకు చాలావరకూ సూర్యోదయం లెక్క కనుక పంచాంగం ప్రకారం శుక్రవారం జరుపుకోవాలని చెబుతున్నారు


ABP Desam


పౌర్ణమి తిథి ఆగస్టు 12వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణిస్తారు. అంటే ఈ రోజంతా రక్షాబంధన్ పండుగ జరుపుకోవచ్చు.


ABP Desam


పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందని విశ్వసిస్తారు. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.


ABP Desam


అందరి పనులూ అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుంది. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని చెబుతారు.


ABP Desam


ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవు. జరిగినా మంచిది కాదు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 11 గురువారం రోజున భద్రకాలం ఉందని చెబుతున్నారు పండితులు.


ABP Desam


అందుకే ఆగస్టు 12 శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో అయితే ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల వరకు కూడా రాఖీ కట్టొచ్చు.


ABP Desam


నోట్: కొందరు పండితులు, పంచాంగం, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Image Credit: Pinterest