(Source: Poll of Polls)
Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!
Happy Rakhi Pournami 2022: మీరు ఏ రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు? ఆగస్టు 11 గురువారమా లేదా ఆగస్టు 12 శుక్రవారమా?.ఆ గందరగోళం తొలగించేందుకు, శుభసమయం చెప్పేందుకే ఏబీపీ దేశం ప్రత్యేక కథనం
Happy Rakhi Pournami 2022: శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ నెలలో ఎన్నో పండగలు పర్వదినాలు వస్తాయి. శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారంతో పాటూ శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజున సోదరీమణులు తమ మణికట్టుకు రాఖీ కట్టి సోదరుడి దీర్ఘాయుష్షు కోరుకుంటారు. తనకు రక్ష కట్టిన సోదరిని జీవితాంతం కాపాడతానని సోదరుడు వాగ్దానం చేస్తాడు.ఈ ఏడాది పౌర్ణమి గడియలు తగులు,మిగులు రావడంతో గందరగోళం నెలకొంది. కొందరేమో ఆగస్టు 11వ తేదీన రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. మరి కొందరు 12వ తేదీ రాఖీ కట్టాలని చెబుతున్నారు. ఇంతకీ పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చింది..ఎప్పటి వరకూ ఉందంటే.
- ఆగస్టు 11 గురువారం ఉదయం దాదాపు 10 గంటలకు ప్రారంభమైన పౌర్ణమి ఆగస్టు 12 శుక్రవారం ఉదయం 7.39 వరకూ ఉంది
- పౌర్ణమి కదా చంద్రుడి లెక్క అని కొందరు, సూర్యోదయం తిథి లెక్క మరికొందరు. దీంతో రాఖీ గురువారం కొందరు, శుక్రవారం మరికొందరు జరుపుకుంటున్నారు
- క్యాలెండర్ ప్రకారం రాఖీ పౌర్ణమి ఆగస్టు 11 గురువారం ఉంది. అయితే పండితులు చెప్పేదేంటంటే తెలుగు పండుగలకు చాలావరకూ సూర్యోదయం లెక్క కనుక పంచాంగం ప్రకారం శుక్రవారం రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని చెబుతున్నారు
- పౌర్ణమి తిథి ఆగస్టు 12వ తేదీన సూర్యోదయానికి ముందు వస్తుంది కాబట్టి ఆ రోజంతా పౌర్ణమి తిథిగా పరిగణిస్తారు. అంటే ఈ రోజంతా రక్షాబంధన్ పండుగ జరుపుకోవచ్చు.
Also Read: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!
ఆగస్టు 11 'భద్ర'కాలం ప్రభావం ఉంటుంది
పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర. అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందని విశ్వసిస్తారు. వీరి స్వభావాన్ని నియంత్రించేందుకే బ్రహ్మదేవుడు పంచాగంలో విష్టి,కరణానికి స్థానం కల్పించాడు. వాస్తవానికి భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందరి పనులూ అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుంది. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని చెబుతారు. ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవు. జరిగినా మంచిది కాదు. అందుకే భద్ర కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 11 గురువారం రోజున భద్రకాలం ఉందని చెబుతున్నారు పండితులు. అందుకే ఆగస్టు 12 శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు. మరీ ప్రత్యేక పరిస్థితుల్లో అయితే ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5:18 గంటల నుంచి 6:20 గంటల వరకు కూడా రాఖీ కట్టొచ్చు. ఫైనల్ గా చెప్పుకుంటే మాత్రం ఆగస్టు 12 వ తేదీనే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలన్నది పండితుల మాట...
నోట్: కొందరు పండితులు, పంచాంగం, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Raed: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు