అన్వేషించండి

TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?

Andhra Pradesh Latest News: తెలుగు దేశం పార్టీ యువకులతో ప్యాక్ అవుతోంది. ఇది ఆనందించే విషయమే అయినా మరో సమస్య కూడా ఆ పార్టీని వెంటాడుతోంది.

Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాలు గమనిస్తున్న వాళ్లకి స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతోంది. టీడీపీలో నెమ్మదిగా సీనియర్లను పక్కన పెడుతూ యువరక్తాన్ని పార్టీలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక పదవులు వాళ్లకే దక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచాక అధిక శాతం మంత్రి పదవులు యువకులకు కొత్తగా ఎమ్మెల్యేలగా ఎన్నికైన వాళ్లకు దక్కాయి. ప్రస్తుత జనరేషన్‌కి ఇది కరెక్టే. కానీ దీనిలో ఒక చిన్న ఇబ్బంది కూడా కనిపిస్తోంది. చాలామంది సీనియర్లు సైలెంట్ అయిపోవడంతో కీలకమైన అంశాల్లో ఇంకా చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు కనిపిస్తోంది. సంక్షోభాన్ని పరిష్కరించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చే ట్రబుల్ షూటర్స్ కరవైపోయారు. 

ఏదైనా ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు పరిష్కరించాలంటే దానికి కచ్చితంగా సీనియారిటీ కావాలి. ప్రత్యర్థి పార్టీలు ఏదైనా అంటే కౌంటర్‌ ప్రెస్‌మీట్ పెట్టి ఇటువైపు నుంచి మరో తిట్టే వాళ్లే ఉంటున్నారు. కానీ ఆ విమర్శలను పార్టీకి అనుకూలంగా మార్చే నైపుణ్యం సీనియారిటీతోనే వస్తుంది. ప్రస్తుత టిడిపిలో అది లోపించిందన్న అభిప్రాయం ఉంది. ఒకప్పుడు చంద్రబాబుకి అండగా ఎర్రన్నాయుడు, కడియం శ్రీహరి, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లాల్ జన్ బాషా లాంటి నేతలు ఉండేవారు. తర్వాత కాలంలో దేవినేని ఉమా, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నరసింహులు ఇలా లిస్టు పెద్దగానే ఉండేది. ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్లు ఎక్కువ మంది వ్యాపారస్థులు, యువకులు కావడంతో ఆ ట్రబుల్ షూటర్ స్థానం లోపించిందన్న మాటలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. 

పార్టీలో డొల్లతనాన్ని ఎత్తి చూపిన ఘటనలు 
టిడిపి ఇటీవల కాలంలో రెండు ఘటనల్లో సీనియరిటీ లేమిని ఎదుర్కొంది. మొదటిది గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఇష్యూ. రెండోది గుంటూరు మిర్చి యర్డు అంశం. గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను, రిజర్వేషన్ వివాదాన్ని నారా లోకేష్ దృష్టికి సరైన సమయంలో అధికారులు తీసుకెళ్లలేదని అంటారు. ఆ తర్వాత జరిగిన తతంగం అందరికీ తెలిసిందే. తాము ఇచ్చిన జీవో 77కు విరుద్ధంగా తామే ఇచ్చిన నోటిఫికేషన్ కావడంతో విపక్ష వైసిపి దీనిలో పెద్దగా కలుగజేసుకోలేదు. కానీ టిడిపికి చాలా ఇబ్బంది కలిగించే పరిణామాలే గ్రూప్ 2 పరీక్ష నిర్వహాణలో ఉన్నాయి. దాదాపు 90 వేలమంది అభ్యర్థులకు సంబంధించిన అంశం కావడంతో వారిలో ఎంత మందిలో ఇంకా దీనిపై వ్యతిరేకత ఉందో బయటకు తెలియని పరిస్థితి. ఈ ఇష్యూని డీల్ చేయడంలో కూటమి ఫెయిల్యూర్ అనే చెప్పాలి. 

రెండోది గుంటూరు మిర్చి యార్డ్‌లో జగన్ నిరసనకు వెళ్లిన అంశం. మిర్చి రేటు పెంపు అంశంలో తన నిరసన తర్వాతే కేంద్రంతో మాట్లాడిన టిడిపి ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిందని ఆ క్రెడిట్ తమదేనని వైసిపి ఓన్ చేసుకుంది. దీనిపై ఒకటి రెండు ప్రెస్ మీట్‌లు పెట్టి జగన్‌ని విమర్శించడం మినహా పెద్దగా చేసింది ఏమి లేదు. 

ఇలాంటి అంశాల్లోనే సీనియారిటీ అనేది పనికొస్తుంది. జరిగిన ఇష్యూలోని అన్ని వివరాలను పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచడం సీనియర్ల వల్ల మాత్రమే అయ్యే పని. 
గతంలో కాంగ్రెస్‌లో వర్కౌట్ అయిన 'కామరాజ్ ప్లాన్ '

కాంగ్రెస్‌లో సీనియర్ మోస్ట్ లీడర్, తమిళనాడుకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కామరాజ్ రూపొందించిందే కామరాజ్ ప్లాన్. దీని ప్రకారం సీనియర్లు ప్రభుత్వ పదవులు నుంచి దిగిపోయి పార్టీకి పరిమితం కావాలి యంగ్ జనరేషన్ మంత్రి పదవిలో ఉండాలి. స్వయంగా తానే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి 1963లో ఈ ప్లాన్‌ ప్రకటించారు. నిజానికి ఇది లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానులు చేయడానికి మొరార్జీ దేశాయ్‌ని దెబ్బ కొట్టడానికి తీసుకొచ్చిన ప్లాన్ అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇందిరా గాంధీకి తర్వాత కాలంలో ఇది ఎంతో ఉపయోగపడింది. ఈ ప్లాన్ పేరుతో సీనియర్లను పార్టీ పదవుల్లో ఉండిపోయేలా చేసి తనకు కావలసిన యంగ్ టీమ్‌ని ప్రభుత్వ పదవుల్లో నియమించుకున్నారామె. అప్పట్లో సరైన విపక్షం ఉండేది కాదు కాబట్టి కాంగ్రెస్‌కి ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు టిడిపి జగన్‌ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. మరి ఇలాంటి సమయంలో సీనియర్లు అందర్నీ పక్కన పెట్టేయడం టిడిపి వేస్తున్న సరైన స్టెప్పో కాదో భవిష్యత్ రాజకీయాలే నిర్ణయిస్తాయి. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget