అన్వేషించండి

Posani: పోసానికి కలసి రాని అదృష్టం - అడ్డం పడిన సీఐడీ - హైకోర్టులోనూ షాకే !

Posani Krishna Murali: అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో పోసాని జైలు నుంచి విడుదలవుతారని అనుకున్నారు. కానీ సీఐడీ కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేయడంతో జైల్లోనే గడపాల్సి వస్తోంది.

Posani Krishna Murali Badluck: పోసానికి కొన్ని కేసుల్లో బెయిల్.. మరికొన్ని కేసుల్లో నోటీసులు జారీ చేయాలని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. దాంతో ఇక కర్నూలు జైలు నుంచి విడుదలయి ఇంటికి వెళదామని అనుకున్నారు కానీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ తో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పిటి వారింటిపై పోసాని నీ గుంటూరు జిల్లా కు  తరలించారు. ఆదోని త్రీ టౌన్ కేసులో అరెస్ట్ అయి ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జిల్లా జైలులో ఉంటున్న పోసానిని..  వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా హాజరు పరచాలని సూచించడంతో గుంటూరు జిల్లాలో కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. సీఐడీ పోలీసులు జారీ చేసిన పీటీ వారెంట్ ను రద్దు చేయాలని అత్యవసరంగా పోసాని తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో పోసాని ఈ కేసుల్లోనూ బెయిల్ వచ్చే వరకూ జైల్లో ఉండాల్సి ఉంటుంది.

వైసీపీ నాయకుడిగా ఉంటూ పోసాని కృషమురళి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను వారి కుటుంబాలను, పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న  బీఆర్ నాయుడుపై తిట్లందుకున్నారు. ఈ విషయంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించి సైలెంట్ అయిపోయారు. కానీ పోలీసులు హఠాత్తుగా  ఫిబ్రవరి నెలాఖరులో ఆయనను రైల్వే కోడూరు పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.   

ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. నర్సరావుపేట కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని..  బెయిల్ ఇవ్వాలని పోసాని న్యాయపోరాటం చేస్తున్నారు.  రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు గుండెపోటు, కడుపు నొప్పి అని నాటకం ఆడటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. రెండు వారాల పాటు జైల్లో ఉండి అటూ ఇటూ తిప్పిన తర్వాత ఇక ఇప్పుడల్లా బెయిల్ రాదేమోనని కంగారు పడుతున్న సమయంలో ఆయనకు బెయిల్ లభించింది. కానీ సీఐడీ పోలీసులు మాత్రం అనూహ్యంగా పీటీ వారెంట్ దాఖలు చేశారు.  

రైల్వే కోడూరు పోలీసులకు ఆయన తనకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన  కుమారుడు స్క్రిప్టులు పంపేవారని.. అందుకే తిట్టేవాడ్ని  అని చెప్పారు. ఈ మేరకు వారిని కూడాపోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో వారిద్దరూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోసాని కృష్ణమురళి తనపై జారీ చేసిన పీటీ వారెంట్లు రద్దు చేయాలని హైకర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చే వరకూ బయటకు రావడం కష్టమేనని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
AP High Court Verdict Local Body Elections 2026: ఏపీ స్థానిక ఎన్నికల పిటిషన్లపై హైకోర్టు తీర్పు నేడే - నోటిఫికేషన్‌కు క్లియరెన్స్ దక్కేనా?
ఏపీ స్థానిక ఎన్నికల పిటిషన్లపై హైకోర్టు తీర్పు నేడే - నోటిఫికేషన్‌కు క్లియరెన్స్ దక్కేనా?
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
Embed widget