Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Andhra Pradesh: పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఛాతినొప్పి రాలేదని పోలీసులు చెప్పారు. ఆయన డ్రామా ఆడారని రైల్వే కోడూరు సీఐ ప్రకటించారు.

Posani Drama: ఛాతిలో నొప్పి అంటూ జైల్లో పోసాని కృష్ణమురళి హంగామా చేయడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తనకు గుండె జబ్బు ఉందని దానికి టాబ్లెట్లు వాడుతున్నట్లుగా చెబుతున్న ఆయన హఠాత్తుగా సెల్ లో తనకు చాతి నొప్పిగా ఉందని రాజంపేట సబ్ జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా వైద్యుల్ని పిలిపించాలి. కానీ హార్ట్ సమస్య అంటున్నారని ముందుగా రాజంపేట సబ్ జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎందుకైనా మంచిదని కడప రిమ్స్ తీసుకెళ్లి టెస్టులు చేయించారు. అయితే అంతా నార్మల్ గానే ఉందని పరీక్షల్లో తేలింది. దీంతో పోసాని డ్రామాలాడారని పోలీసులు మండిపడ్డారు.
ఛాతి నొప్పి అనగానే ఆస్పత్రికి తరలించిన పోలీసులు
రాజంపేట సబ్ జైల్లో పోసాని చాతీ నొప్పి అంటూ తెలిపాడని.. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించామన్నారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజంపేట నుంచి కడప రిమ్స్ కు తరలించి మరోసారి మైరుగైన చికిత్స అందించామన్నారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు..పోసాని డ్రామా ఆడుతున్పాడని .. ఈసిజి తో పాటు రక్త పరీక్షలు నిర్వహించామన్నరాు. రిమ్స్ లో వైద్య పరీక్షలు అనంతరం మళ్ళీ రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని ప్రకటించారు.
రిమాండ్ కు తరలించే ముందే అన్ని పరీక్షలు
పోసాని కృష్ణమురళిని రిమాండ్ కు తరలించే ముందు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆయన మెడికల్ రికార్డును కూడా పరిశీలించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించారు. ఆయన ఉపయోగించే మందులన్నీ ఆయనకు అందుబాటులో ఉంటారు. తనను అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయన టెన్షన్ పడుతున్నారు. అరెస్టు చేసేందుకు తన ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులతో ఆయన విపరీతంగా ప్రవర్తించారు. మొదటగా తాను రానన్నారు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి బతిమాలారు. తర్వాత ఆయన బనీన్ , నిక్కర్ మీదనే హడావుడి చేశారు.
కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న పోలీసులు
పోలీసులు అరెస్టు చేస్తున్నందున ఆయన తీవ్రంగా టెన్షన్ పడినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు కూడా దాదాపుగా తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. అరెస్టు చేసినప్పటి నుండి ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. పోలీసుల విచారణలో తాను స్వతహాగా అన్న మాటలు కావని.. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి స్క్రిప్ట్ వస్తే మాట్లాడిన మాటలని.. సజ్జల భార్గవరెడ్డి వాటిని వైరల్ చేసేవారని ఆయన చెప్పినట్లుగా పోలీసులు వాంగ్మూలం రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారని అనుకున్నారు. కానీ ఆయన కావాలనే డ్రామా ఆడారని పోలీసులు స్పష్టత ఇవ్వడంతో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.





















