Happy Kanuma 2025 Wishes In Telugu: కనుమ పండుగ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!
Happy Kanuma 2025 Wishes : మీ బంధుమిత్రులకు ఈ కోట్స్‌తో కనుమ శుభాకాంక్షలు చెబితే చాలా సంతోషిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే ముందే.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలుచెప్పేయండి మరి.
Happy Kanuma 2025: సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు కనుమ. ఇది పూర్తిగా రైతుల పండుగ. మనకు ఆహారాన్ని అందించే పశువులకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. వ్యవసాయంలో సహకరించే పశువులకు స్నానం చేయించి పసుపు రాసి కుంకుమ పెట్టి అందంగా అలంకరించి..పూజిస్తారు. ఈ రోజు వాటిలో పనులు చేయించరు...ఆహారాన్ని అందించి పూర్తిగా విశ్రాంతిని ఇస్తారు. రైతులను రాజుగా మార్చే కనుమ పండుగ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
మీకు మీ కుటుంబ సభ్యులు అందరకీ కనుమ పండుగ శుభాకాంక్షలు
రైతులను రాజుగా మార్చే పండుగ
పంట చేలు కోతలతో ఇచ్చే కానుక
కమ్మనైన వంటలతో కడుపు నింపే కనుమ
అందరి ఇంట్లోనూ జరగాలి ఈ వేడుక
కనుమ పండుగ శుభాకాంక్షలు!
రోకళ్లు దంచే ధాన్యం..మనసులు నింపే మాన్యం
రెక్కల కష్టంలో సహకరించే పాడి పశువులు
ఇలాంటి వేడుక మళ్లీ మళ్లీ జరుపుకోవాలి
కనుమ పండుగ శుభాకాంక్షలు!
Also Read: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!
అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ
శ్రమకోర్చిన పశువులకు అందించే గౌరవం కనుమ
అందరం కలిసి కష్టసుఖాలు పంచుకునే పర్వదినం
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!
ఏడాదంతా తన కష్టంలో పాలు పంచుకునే పశువులను పూజించే పండుగ కనుమ
తెలుగువారందరకీ కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
మట్టిలో పుట్టే మేలిమి బంగారం
కష్టం చేతికి అందొచ్చే తరుణం
నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం
'కనుమ'రూపంలో వడ్డించింది పరమాన్నం
కనుమ పండుగ శుభాకాంక్షలు
ముంగిళ్లలో మెరిసే రంగు ముగ్గులు
తెలుగుదనాన్ని తట్టిలేపే చిట్టితల్లులు
బసవన్నల ఆటపాటలతో సరదా సంక్రాంతి
ఈ 'కనుమ' మీకు కమ్మని అనుభూతులు అందించాలి
కనుమ శుభాకాంక్షలు
ఈ మూడు రోజుల సందడి ఏడాది మొత్తం జ్ఞాపకం
బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే సంబరం
మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!
కనుమ రోజు మినుము తినాలి అంటారు ఎందుకో తెలుసా...
కనుమ రోజు మాంసాహారం తింటారు. మాంసాహారం తినని వారికి దానితో సమానమైన పోషకాలు ఇస్తుంది మినుము. అందుకే నాన్ వెజ్ తినేవారు గారెలు, మాంసాహారం తీసుకుంటారు. శాఖాహారం తినేవారు గారెలు తింటారు. చల్లటి వాతావరణంలో శరీరానికి తగినంత వేడిని పెంచేందుకు ఉపయోగపడతాయి. కనుమ రోజు విందు భోజనం తీసుకోవడమే కాదు..అందరూ కలసి తినాలి అనే నియమం కూడా ఉంది. ఉదయాన్నే పశువులను పూజించడం...మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదం పెట్టడం..కుటుంబంలో అంతా కలసి భోజనం చేయడం ఈ రోజు ప్రత్యేకత. కొన్నీ ఊర్లలో కనుమ రోజు పొంగలి వండటం, అమ్మవార్లకు బలి ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
కనుమ తర్వాత రోజు వచ్చే నాలుగో రోజును ముక్కనుమ అంటారు. నాలుగు రోజుల సంక్రాంతి పండుగ జరుపుకునేవారికి ఆఖరి రోజు ఇదే. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. తమిళనాడులో కూరగాయలు, పప్పు, చింతపండు, బెల్లంతో వంటకాలు తయారు చేస్తారు.