అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu Today మార్చి 26 ఎపిసోడ్: మేనమామ వస్తున్నాడన్న రోహిణి.. బాలుకి మొదలైన అనుమానం - గుండె నిండా గుడి గంటలు మార్చి 26 ఎపిసోడ్ హైలెట్స్!
Gundeninda GudiGantalu Today episode: రోహిణి కి ప్రభావతి గడువుపెట్టడంతో తన మావయ్యగా మటన్ కొట్టు షాపువాడిని రంగంలోకి దించుతుంది రోహిణి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 26th Episode Highlights
1/8

మీనాకి చీర కొని తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తాడు బాలు. నా దగ్గరున్న డబ్బులు సరిపడక నీ దగ్గర కొంతమొత్తం తీసుకున్నా..తాగడానికి కాదని చెబుతాడు. మురిసిపోయి ముద్దుపెడుతుంది మీనా.
2/8

మటన్ కొట్టు మాణిక్యం ఊహల్లో తేలిపోతాడు. ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ల ఫొటోస్ చూపించి వీళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్టులే అని చెబుతుంది. అప్పుతీసుకుని తానుకొన్న వస్తువులు, తనదగ్గరున్న డబ్బులు వాడి చేతికి అందించి ఇంటికి తీసుకొచ్చి ఇమ్మని చెబుతుంది రోహిణి
3/8

రోహిణి ఎక్కడ అని మనోజ్ ని అడుగుతుంది ప్రభావతి. కాల్ లిఫ్ట్ చేయడం లేదని మనోజ్ చేప్పడంతో మళ్లీ ఊరెళ్లిపోయి ఉంటుందేమో అంటూ హడావుడి చేస్తుంటే రోహిణి వస్తుంది
4/8

మలేషియా నుంచి మీ నాన్న వస్తున్నారా అని అడిగితే..తను రావడం లేదు నా మేనమామను పంపిస్తున్నారని చెబుతుంది. మా నాన్న లండన్ వెళ్లారని అంటుంది..నిన్న జర్మనీ అని చెప్పావుకదా అంటాడు సత్యం. బస్ ఎక్కాడు మా మేనమామ వస్తున్నాడు అంటుంది. నేరుగా బామ్మగారి ఊరికి వస్తానన్నారు అంటుంది
5/8

బస్సు ఎక్కడం ఏంటీ? మలేషియా నుంచి మన ఊరికి బస్ ఉందా అని క్వశ్చన్ చేస్తాడు బాలు. మనోజ్ రియాక్టై అది ఎయిర్ బస్ అంటాడు. మొదటిసారి రోహిణి పుట్టింటి నుంచి ఒకరొస్తున్నారంటూ బాలు సైలెంట్ గా ఊరుకుంటాడు
6/8

సత్యం వాళ్ల అమ్మగారు అందర్నీ ఉగాదికి రమ్మని పిలవడంతో అంతా రెడీ అవుతారు. శృతి మాత్రం తాను విలేజ్ కి రాను అని తేల్చి చెబుతుంది. తనకు పెండింగ్ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఉందంటుంది. అక్కడ ఎలాంటి లోటు జరగదు అని మాటిస్తాడు రవి
7/8

సత్యం కుటుంబం మొత్తం ఊరికి వెళతారు. అక్కడ నానమ్మను చూడగానే బాలు సంతోషంగా ఆమెను ఎత్తుకుని తిప్పుతాడు. అందర్నీ చూసి సుశీలమ్మ సంతోషిస్తుంది.
8/8

గుండెనిండా గుడిగంటలు మార్చి 27 ఎపిసోడ్ లో జూనియర్ ఆర్టిస్టుకి కాల్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది రోహిణి. అది విన్న బాలుకి అనుమానం వస్తుంది.
Published at : 26 Mar 2025 08:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion