Samantha : ఆస్ట్రేలియా వెకేషన్ పిక్స్ వెనక ఉన్నది ఎవరు? - నెటిజన్ ప్రశ్నకు సమంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Samantha : సమంత సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్‌ను సందర్శించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిక్స్ తీసింది ఎవరు? అనే ఓ నెటిజన్ ప్రశ్నకు సామ్ తాజాగా బదులిచ్చింది.

Samantha Replies Netizen Question On Sidney Wildlife Park Photos: సౌత్ క్వీన్ సమంతా రూత్ ప్రభు ఇప్పుడు ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఓ రోజంతా సరదాగా గడిపిన సామ్, ఆ అద్భుతమైన క్షణాలను ఫోటోల్లో బంధించిన, సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫోటోల్లో సామ్ క్యాజువల్ డ్రెస్‌లో మెరిసింది. పార్క్‌లో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ, అక్కడి జంతువులను చూస్తూ మురిసిపోయింది. సామ్ దీనికి సంబంధించి షేర్ చేసిన పిక్స్ తీసింది ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది.
సమంత వెకేషన్ ఫోటోలు క్లిక్ చేసింది ఎవరు ?
ఆస్ట్రేలియా వెకేషన్ పిక్స్‌లో సామ్ బూడిద రంగు ఫుల్-స్లీవ్ చొక్కా, నీలి రంగు జీన్స్ ధరించి కన్పించింది. అంతేకాదు కౌబాయ్‌లాగా క్యాప్ కూడా పెట్టుకుంది. తన పోస్ట్‌లో "ప్రకృతి, జంతువులు, మంచి వైబ్స్! కంగారూలకు ఆహారం ఇవ్వడం నుంచి నిద్రపోతున్న కోలాల వరకు... ఇది చాలా అందమైన సమయం! ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం వారు చేసే అద్భుతమైన పునరావాస పనులన్నింటికీ @featherdalewildlifepark బృందానికి అభినందనలు" అని సామ్ క్యాప్షన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ ఒక అభిమాని "మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని ఫోటోలను ఎవరు క్లిక్ చేశారు?" అని అడిగారు. సామ్ వెంటనే "@sydneytourguide Naomi" అని బదులిచ్చింది. అంటే సమంత వెకేషన్ పిక్స్ తీసింది అక్కడి లోకల్ టూరిస్ట్ గైడ్ అన్నమాట.
బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమ, నిశ్చితార్థం?
సమంత తెలుగు వాళ్లైన రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని చాలా రోజుల నుంచి రూమర్లు విన్పిస్తున్నాయి. సమంత గతంలో రాజ్ డీకే తీసిన 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే హిట్ సిరీస్‌లో నటించగా, అందులో ఆమె పాత్ర కాంట్రవర్సీలకు దారితీసింది. ఆ తర్వాతే నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి కన్పిస్తే చాలు, లవ్ బర్డ్స్ అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందనే పుకార్లు విన్పించాయి. కానీ సామ్, రాజ్ మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించలేదు.
ఇదిలా ఉండగా సమంత చివరిసారిగా 'సిటాడెల్: హన్నీ బన్నీ' సిరీస్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. త్వరలోనే సామ్... రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'లో కన్పించనుంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, జైదీప్ అహ్లవత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే ఏడాది విడుదల కానుంది. అలాగే సామ్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ విత్ రాజ్ & డీకే' అనే మరో వెబ్ సిరీస్‌తో పాటు ఆమె నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో కూడా నటిస్తోంది.





















