By: Khagesh | Updated at : 27 Mar 2025 07:17 PM (IST)
ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్ను రూల్స్‌లో వచ్చి 8 మార్పులు ఇవే ( Image Source : Other )
8 Income Tax Rules changes: ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి ఏప్రిల్ శాలరీ ఉద్యోగులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన పన్నురాయితీలు ఇప్పటి నుంచే అమల్లోకి రానున్నాయి. అందుకే జీతగాళ్లంతా ఈ ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏఏ రూల్స్ అమల్లోకి వస్తున్నాయో తెలిసినప్పటికీ ఈ స్టోరీ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుంది.
1. సెక్షన్ 87 A కింద పన్ను రాయితీ
ఎక్కువ మంది ఉద్యోగులు ఏప్రిల్ కోసం ఎదురు చూస్తున్నది దీని కోసమే. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 87 A కింద పన్ను రాయితీ పెరగనుంది. 12 లక్షల వరకు ఆదాయం పొందే వాళ్లకు ఎలాంటి పన్ను ఉండదని కేంద్రం ప్రకటించిన వేళ ఈ రాయితీ వర్తిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంతో ఈ రాయితీ పాతిక వేల నుంచి ఏకంగా అరవై వేలకు పెరగనుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా యాడ్ అవుతుంది. అంటే 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండబోదు. ఇది కేవలం కొత్త పన్ను విధానాన్ని తీసుకున్న వాళ్లకే వర్తిస్తుంది. పాత వన్ను విధానంలో ఉన్న వారికి ఎలాంటి మార్పు లేదు.
2. పన్ను స్లాబ్, రేట్లు ఎలా ఉంటాయంటే
ఏప్రిల్ 1 నుంచి న్యూ రెజీమ్‌లో పన్ను స్లాబ్, రేట్లు మారుతున్నాయి. బేసిక్ ఎగ్జంప్సన్ లిమిట్ 3 లక్షల నుంచి 4 లక్షలకు పెరుగుతుంది. 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై అత్యధికంగా 30% పన్ను రేటు వర్తిస్తుంది. కొత్త విధానంలో స్లాబ్‌లు, రేట్లను ఇక్కడ చూడొచ్చు
2025-26 ఆర్థిక సంవత్సరం : 12.75 లక్షల ఆదాయం దాటితే కొత్త పన్ను విధానం స్లాబ్, రేట్లు
| ఆదాయం స్థాయి | ట్యాక్స్ రేటు | |
| 1 | 0 - 4 లక్షలు | పన్ను లేదు |
| 2 | 4 - 8 లక్షలు | 5% |
| 3 | 8 - 12 లక్షలు | 10% |
| 4 | 12 - 16 లక్షలు | 15% |
| 5 | 16 - 20 లక్షలు | 20% |
| 6 | 20 - 24 లక్షలు | 25% |
| 7 | 24 లక్షలపైన | 30% |
పాత పన్ను విధానం ప్రకారం పన్ను విధానంలో మార్పు లేదు. 7 లక్షల ఆదాయం దాటితే స్లాబ్, రేట్లు
| మొత్తం ఆదాయం | ట్యాక్స్ రేటు | |
| 1 | 2,50,000 వరకు | పన్ను లేదు |
| 2 | 2,50,001 నుంచి 5,00,000 | 5% |
| 3 | 5,00,001 నుంచి 10,00,000 | 20% |
| 4 | 10,00,000 పైన | 30% |
3. కొత్త TDS పరిమితులు
వివిధ లావాదేవీలకు TDS/TCS తగ్గించే కనీస మొత్తం పెరుగుతుంది. బ్యాంక్ డిపాజిట్లపై TDS పరిమితి 40,000 నుంచి 50,000 వరకు పెరుగుతుంది. ఇతర మార్పులను ఇక్కడ చూడొచ్చు.
4. పెర్‌క్విజైట్స్ మార్పు
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు కంపెనీ నుంచి పొందే సౌకర్యాలు, ప్రయోజనాలను పెర్‌క్విజైట్స్‌గా గుర్తించరు. ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యుని వైద్య చికిత్స కోసం దేశం వెలుపల ప్రయాణానికి యజమాని చేసే ఖర్చును కూడా ఇందులోకి తీసుకురారు.
5. ULIP పన్ను విధానం
మీరు తరచూ ULIPలలో పెట్టుబడి పెడుతుంటే వాటి నుంచి వచ్చే ఆదాయంపపై కూడా ట్యాక్స్ వేస్తారు. బడ్జెట్ 2025 ప్రకారం 2.5 లక్షల రూపాయల కంటే మించిన ప్రీమియం ULIPలు క్లోచ్ చేసుకున్నప్పుడు వచ్చిన ఆదాయంలో ట్యాక్స్ చెల్లించాలి. దీన్ని కూడా ఆదాయ వనరుగానే పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 112A కింద వాటికి పన్ను వేస్తారు.
6. NPS వాత్సల్యతో పన్ను ఆదా
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఇంకో ఆఫర్ ప్రకటించింది కేంద్రం. తమ పిల్లల NPS వాత్సల్య ఖాతాకు విరాళాలు ఇచ్చి పన్ను మినహాయింపు పొంద వచ్చు. పాత పన్ను విధానంలో 50,000 రూపాయల వరకు అదనపు మినహాయింపు వస్తుంది.
7. సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రొపర్టీ వార్షిక విలువ సరళీకృతం
జీతం పొందే ఉద్యోగులు, ఇతర పన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 1 నుంచి గరిష్టంగా రెండు ప్రొపర్టీలపై నిల్ వాల్యూ క్లెయిమ్ చేయవచ్చు. అది సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రొపర్టీయా కాదా అనే అంశంతో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు.
8. నామినీకి డిజిటల్ లాకర్ అధికారం
ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ స్టేట్‌మెంట్‌లను యాక్సెస్ చేయడానికి మీ డిజిలాకర్‌పై ఉన్న అథార్టీని నామినీకి కూడా ఇవ్వొచ్చు.
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్! - ఆ ఛానల్లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?