Prabhas: ప్రభాస్ పెళ్లి వార్తలు - అన్నింటికీ చెక్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన టీం
Prabhas Marriage Rumours: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి రూమర్లపై ఆయన టీం స్పందించింది. అవన్నీ ఫేక్ అని అసత్య ప్రచారం నమ్మొద్దంటూ స్పష్టం చేసింది.

Prabhas Team Clarified About Marriage Rumours: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పెళ్లి వార్తలపై ఆయన టీం తాజాగా స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయన వివాహం జరగనుందంటూ గురువారం అటు సోషల్ మీడియా, ఇటు మీడియాలో కథనాలు హల్చల్ చేశాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి జరగనుందని.. కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు సైతం రాశాయి.
అసత్య ప్రచారం నమ్మొద్దు
ఈ క్రమంలో ప్రభాస్ టీం వీటిపై స్పష్టత ఇచ్చింది. ఆ ప్రచారం నిజం కాదని.. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. అయితే, గతంలోనూ ప్రభాస్ పెళ్లిపై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో అనుష్కను పెళ్లి చేసుకోనున్నాడనే రూమర్స్ వినిపించగా.. ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. తామిద్దరం ఎప్పటికీ స్నేహితులమేనని స్పష్టం చేశారు.
Also Read: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 14 సినిమాలు - ఈ నాలుగు మోస్ట్ అవైటింగ్ సినిమాలను మిస్ కావొద్దు
ఇదే విధంగా అనుష్క పెళ్లిపైనా గతంలో రూమర్స్ వినిపించాయి. ఆమె కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్‌ను వివాహం చేసుకుంటుందనే వార్తలు హల్చల్ చేశాయి. అవన్నీ ఫేక్ అంటూ ఆ తర్వాత అనుష్క టీం క్లారిటీ ఇచ్చింది. సెలబ్రిటీల వివాహాలపై సోషల్ మీడియాలో ఇలానే రూమర్స్ వస్తుంటాయని.. అధికారికంగా వారి సన్నిహితులు, టీం స్పందించేవరకూ ఎలాంటి ప్రచారం చేయకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో 'రాజాసాబ్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ మూవీ టీజర్ త్వరలోనే రానుందనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 మూవీస్ చేస్తున్నారు.





















