Horoscope Today : ఈ రాశివారి విధేయతకు అంతా ఫిదా అయిపోతారు.. మీ మాటకు విలువ పెరుగుతుంది!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 28 శుక్రవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ఫీల్డ్‌లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు సాంకేతిక విషయాలపై మీ జ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోల్పోయిన వస్తువు తిరిగి పొందుతారు
వృషభ రాశి
ఈ రోజు పెద్దల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో ఏదైనా వస్తువు చెడిపోవచ్చు. ఆదాయ అవకాశాలు తగ్గుతాయి. పెద్ద ఖర్చు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే జాగ్రత్తగా మరోసారి సరిచూసుకోండి
మిథున రాశి
ఈ రోజు కెరీర్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వవద్దు. గాయపడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ప్రయత్నించండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు కీర్తి లభిస్తుంది. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందవచ్చు. కఠినమైన పదాలను ఉపయోగించవద్దు. మనస్సులో ఉత్సాహం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. చిన్నపిల్లలపై శ్రద్ధ వహించండి
సింహ రాశి
ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా మీకు వ్యాపారంలో ప్రయోజనం చేకూరుస్తుంది. మీ ప్రతిభను బాగా ఉపయోగించగలరు. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం పొందుతారు. కుటుంబ సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆలోచనాత్మక వ్యక్తులతో మీ స్నేహం పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఓ ముఖ్యమైన వస్తువును కోల్పోవడంతో మీ మనసు కలత చెందుతుంది. అలెర్జీల కారణంగా మీకు ఇబ్బంది ఉంటుంది. ప్రత్యర్థులు మీపై కుట్రను సృష్టించవచ్చు. మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి
తులా రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో పని శైలిని మార్చవలసి ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించండి. పిల్లలు అధ్యయనాలలో నిర్లక్ష్యంగా ఉంటారు. మీ కష్టానికి అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. పెరుగుతున్న ఖర్చులను తగ్గించడంలో మీరు విజయవంతమవుతారు. ఉద్యోగంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. చిన్న తరహా పరిశ్రమలతో సంబంధం ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీరు పని గురించి ఆచరణాత్మకంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొంతమంది మీ నుండి డబ్బు ఆశిస్తారు. ఎవరితోనూ వాదించవద్దు. ప్రతి పనిలో అసోసియేట్స్ మీకు సహాయం చేస్తారు. ఇంతకు ముందు చేసిన కృషికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
మకర రాశి
ఈ రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. సామాజిక పనిలో పాల్గొంటారు. పరిస్థితుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
కుంభ రాశి
ఈ రోజు ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు. పాత రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఉంటాయి. వృద్ధుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తలనొప్పితో బాధపడతారు. వైవాహిక జీవితంలో అసమ్మతి ఉండవచ్చు. మీరు ఇంతకు ముందు ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందవచ్చు.
మీన రాశి
ఉద్యోగం మారాలి అనే ఆలోచన వస్తుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. మీ విధేయతను చూసి మిమ్మల్ని అనుసరించాలి అనుకుంటారంతా. కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది.
ఉగాది 2025 - శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

