అన్వేషించండి
Brahmamudi Serial Today March 25th Episode Highlights: నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా.. ఆలోచనలో పడిన రాజ్ - బ్రహ్మముడి మార్చి 25 ఎపిసోడ్ హైలెట్స్!
Brahma Mudi Serial Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahmamudi Serial March 25th Episode written update
1/9

రాజ్ బతికేఉన్నాడా అని సందేహపడుతుంది రుద్రాణి. ఈరోజు నుంచి కావ్యను ఫాలో అవ్వు అని రాహుల్ కి చెబుతుంది. నిజంగా రాజ్ బతికే ఉంటే మనమే ప్రాణం తీసేద్దాం అని ప్లాన్ చేస్తుంది రుద్రాణి.
2/9

కావ్య దేవుడి దగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. యామిని ఎవరు? తనే నా భర్త అని నా మనసు చెబుతోంది? ఏది నిజమో తేల్చుకోలేకుండా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గతం గుర్తుచేయాలంటే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారని బాధపడుతుంది
3/9

రాజ్ సీరియల్‌గా ఆలోచించడం చూసి గతం ఎక్కడ గుర్తుకొస్తుందోనని యామిని కంగారు పడుతుంది. ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులను పంపిస్తుంది. నీకు గతం గుర్తుకురావాలని స్కూల్ కి తీసుకెళ్లమని మేమే చెప్పాం అంటారు.
4/9

యామిని చెప్పిందే నా గతం అని నేను నమ్మలేకపోతున్నా అంటాడు రాజ్. ఫ్రెండ్స్ క్లోజ్ గా మాట్లాడారు, మా అమ్మా నాన్న సమాధుల దగ్గరకు తీసుకెళ్లింది..నాకు అసలు ఏవీ గుర్తుకురావడం లేదంటాడు. మా అమ్మానాన్నల స్థానంలో ఉండి పెంచిన మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేకపోవడం ఏంటి అంటాడు
5/9

నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా బావా అంటూ వస్తుంది యామిని. నువ్వు బావా అని పిలుస్తుంటే నా పిలుపు నా గుండెకు చేరడం లేదంటాడు. సెంటిమెంట్స్ డైలాగ్స్ కొడుతుంది కానీ రాజ్ లో ఎలాంటి మార్పు రాదు
6/9

యామిని కార్ నంబర్ అప్పుకి ఇచ్చిన కావ్య ఈ కారులోనే బావను చూశాను అంటుంది. రాజ్ గతం మర్చిపోయాడంటూ తాను చూసినదంతా చెబుతుంది. తెల్లారేసరికి అడ్రస్ ఇస్తుంది అప్పు
7/9

దుగ్గిరాల ఇంటి కోడలిని చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదంటూ సెటైర్స్ వేస్తుంది రుద్రాణి. రాజ్ పోయాడన్న బాధ లేదు, ఇంట్లో వాళ్ల గురించి బెంగా లేదంటూ ఏదేదో వాగుతుంంది. మార్చిలో ఆడిటింగ్ ఉంటుందని అప్పటికి రాజ్ అక్కడుండాలి అంటుంది రుద్రాణి
8/9

మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్లి పాతికేళ్లు అయింది బతికే ఉన్నాడా అని రుద్రాణిని అడుగుతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ అని ఫైర్ అవుతుంది రుద్రాణి. పాతికేళ్ల క్రితం దూరమైన మీ భర్త బతికే ఉన్నాడా అంటే మీకు కోపం వస్తే నేను చూసిన నా భర్త చనిపోయాడు అంటే నాకు కోపం రాదా అంటుంది
9/9

బ్రహ్మముడి మార్చి 26 ఎపిసోడ్ లో యామిని ఇంటికి వెళుతుంది కావ్య. డోర్ తీసి కళావతిని చూసి షాక్ అవుతాడు రాజ్.యామినిలో టెన్షన్ మొదలవుతుంది
Published at : 25 Mar 2025 09:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion