Shardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడు
సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనగానే. అందరూ 300 గురించే మాట్లాడుకున్నారు. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది కాబట్టి. కానీ శార్దూల్ ఠాకూర్ మాత్రం అలా అనుకోలేదట. ముందు అసలు తను ఈ ఐపీఎల్ ఆడటమే ఓ విచిత్రం కాబట్టి తనకు వచ్చిన ఛాన్స్ రిస్కీగా నే తీసుకోవాలనుకున్నాడట శార్దూల్ ఠాకూర్. సన్ రైజర్స్ పై 5వికెట్ల తేడాతో లక్నో సూపర్ విక్టరీ కొట్టేశాక మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఈ రోజు తన ప్లాన్ ఏంటో చెప్పాడు. సన్ రైజర్స్ బ్యాటర్స్ అస్సలు తగ్గట్లేదు. ఏ టీమ్ అయినా ఏ బౌలర్ అయినా వాళ్లకు ఒకటే బాదుతూనే ఉంటారు. అందుకే తను వేరే స్ట్రాటజీతో వచ్చాడంట. వాళ్లు ఎలా అయితే అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తారో తను కూడా అలానే అగ్రెసివ్ గా బౌలింగ్ చేయటానికి చూశాడట. అంటే రన్స్ ఆపాలి...వికెట్లు తీయాలి లాంటి స్ట్రాటజీ లేకుండా చేతికి వచ్చినట్లు బంతిని విసిరిపారేయటమే. కొడితే సిక్సు కొడతారు లేదంటే అవుటయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అయితే ప్రతీ బంతీ సిక్సే వెళ్లాలన్నట్లు ఛాన్స్ తీసుకుని సన్ రైజర్స్ బ్యాటర్లు ఆడుతున్నారో అలానే ఏ బాల్ వేస్తున్నామనే ఐడియా కూడా లేకుండా ప్రతీ బంతినీ భయపెట్టేలా విసరాలనే ప్లాన్ తో బౌలింగ్ వేశా కాబట్టే అభిషేక్ శర్మను, గత మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఊపుమీదున్న ఇషాన్ కిషన్ ను ఒకే ఓవర్ లో అవుట్ చేశానని చెప్పాడు శార్దూల్ ఠాకూర్. అసలు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిని ఛాన్స్ రావటమే ఎక్కువ ఇక అందరికీ భయపడుతూ కూర్చుంటే నా ప్రత్యేకత ఏముంటుంది అందుకే ఛాన్స్ తీసుకున్నా రిస్క్ చేశా ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు శార్దూల్ ఠాకూర్.





















