Shardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam
నిన్న సన్ రైజర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలిచింది అంటే కారణం లార్డ్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఠాకూర్ కి చెన్నై సూపర్ కింగ్స్ లార్డ్ అని పేరు ఎందుకు పెట్టిందో నిన్న మళ్లీ ప్రూవ్ చేశాడు. అస్సలు ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూ వికెట్లు తీయటం శార్దూల్ స్టైల్. అలాంటి ఫీట్ ను నిన్న సన్ రైజర్స్ మీద ప్రదర్శించాడు ఠాకూర్. అరివీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండి 300 కొట్టడమే నిన్నటి మ్యాచ్ లో టార్గెట్ అన్నట్లు ఉన్న సన్ రైజర్స్ ను స్టార్టింగ్ లో ఊహించని రీతిలో దెబ్బకొట్టాడు ఠాకూర్. ఒకే ఓవర్ లో నిప్పులు చెరిగే బంతులతో అభిషేక్ శర్మను, ఇషాన్ కిషన్ ను అవుట్ చేసి ఆరెంజ్ ఆర్మీని కోలుకోలేని దెబ్బ తీశాడు. చివర్లో మరో రెండు వికెట్లు కూడా తీయటంతో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుని సన్ రైజర్స్ ను 190 పరుగులకే కట్టడి చేయటంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవటంతో పాటు..రెండు మ్యాచుల్లోనే 6 వికెట్లు తీసి ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ ను తన దగ్గరే పెట్టుకున్నాడు. అయితే శార్దూల్ ఠాకూర్ కథ ఈసారి భిన్నం. వాస్తవానికి అతన్ని 2025 ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ కొనలేదు. గతేడాది నవంబర్ లో జరిగిన వేలంలో 2కోట్ల రూపాయల బేస్ ప్రైస్ గా ఉన్న శార్దూల్ తన సొంత టీమ్ చెన్నై వద్దునుకోగా...మరెవ్వరూ తీసుకోలేదు. రీజన్ గడచిన రెండేళ్లుగా ఠాకూర్ ఫామ్. 2024 ఐపీఎల్లో అయితే 9 మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఏ టీమ్ వద్దనుకుంది. గాయాలు కూడా వేధిస్తుండటంతో సర్లే కౌంటీ క్రికెట్ ఆడుకుందాం టెస్టు టీమ్ లో చోటు కోసం ట్రై చేద్దాం అని ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ కోసం ఎసెక్స్ టీమ్ తో టై అప్ అవ్వాలని చూశాడు. ఈలోగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి జహీర్ ఖాన్ ఫోన్ చేశాడటం. మేం తీసుకున్న బౌలర్ మోషిన్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీలో గాయపడ్డాడు కాబట్టి తన ప్లేస్ లో నిన్ను తీసుకుంటాం ఎవ్వరికీ సైన్ చేయకు అని చెప్పాడట. అలా టీమ్ లోకి 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తోనే వచ్చిన శార్దూల్ ఠాకూర్ రెండు మ్యాచుల్లోనే 6 వికెట్లు తీసి ఈరోజు వరకూ హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలవటంతో పాటు తనలోని క్రికెటింగ్ సత్తాను ప్రూవ్ చేసుకున్నాడు లార్డ్ అనిపించుకున్నాడు శార్దూల్ ఠాకూర్.





















