Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకని నిర్వాసితులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు కారణంగా భూములు ఇళ్లు కోల్పోయిన వాళ్ళకి R&R ప్యాకేజీ ఇస్తుంది ప్రభుత్వం. నిజానికి ప్రాజెక్టు వ్యయంలో అధిక భాగం ఈ పునరావాస ప్యాకేజీ కే వెళుతుంది. ఏ ప్రాజెక్టు లో నైనా ఇది సహజం. అయితే పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ లో భాగంగా కొందరికి 6, 36,000 మరి కొందరికి 10 లక్షలు ఇస్తున్నారు.
తేడా ఎందుకంటే!
పునరవాస ప్యాకేజీ లో ఈ తేడా ఎందుకంటే ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకోసం 49 పునరావాస కాలనీలను కడుతోంది. ఏపీ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి ఒక్కో ఇంటిని ఈ కాలనీలో కేటాయిస్తుంది. ఆ ఇల్లు కావాలి అనుకున్నవారికి ఇంటితోపాటుగా ఆరు లక్షల 36 వేల రూపాయల నగదుని వాళ్ల ఎకౌంట్లలో డిపాజిట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ కాలనీల్లో తమకు ఇల్లు వద్దు అన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలను అందిస్తోంది. అందుకనే పునరావాస ప్యాకేజీల్లో ఈ తేడాలు.
అదనం గా మరికొన్ని కాలనీలు
2014 -19 మధ్య కాలంలో నిర్వాసితుల లెక్కలు తీశారు. అయితే ఈ ఆరేళ్లలో అప్పట్లో మైనర్ లుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మేజర్లు అయ్యారు. వాళ్లకి కుటుంబాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిని కూడా ప్రస్తుతం పునరావాస ప్యాకేజ్ లోకి తీసుకొచ్చారు. అలాంటి వారి కోసం మరొక 25 కాలనీలు పడుతున్నారు మొత్తం పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీల సంఖ్య 74కి చేరింది. ప్రస్తుతానికి 14,329 కుటుంబాలను ఆల్రెడీ కట్టిన పునరావాస కాలనీలకు తరలించగా మరో 6,578 కుటుంబాలను షిఫ్ట్ చెయ్యాలి. దీనికోసం 2014-19 మధ్యకాలం లో 4000 కోట్ల పైగా ఖర్చు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో 828 కోట్లు నిర్వాసితుల అకౌంట్స్ లో జమ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం పునర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బు, ఇళ్ళు ఇవ్వడం పూర్తి చేశాకే పోలవరం నుంచి నీళ్లు వదులుతామని ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల ముందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తిగా అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దీనికోసం టార్గెట్ ని 2027 డిసెంబర్ ను ఫిక్స్ చేసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

