L2: Empuraan OTT Partner: ఆ ఓటీటీలోకి మోహన్‌లాల్ 'L2: ఎంపురాన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
L2: Empuraan OTT Release: మలయాళ స్టార్ మోహన్‌లాల్ 'L2: ఎంపురాన్' మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Mohanlal's L2: Empuraan OTT Partner Fix: మలయాళ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన 'L2: ఎంపురాన్' (L2: Empuraan) బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన మూవీ.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మంచి ప్రశంసలు అందుకుంది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్'లో (Disney + Hotstar) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ 'పింక్ విల్లా' ఈ మేరకు తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ మూవీ హక్కులను భారీ ధరకు జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రన్ తర్వాత త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
మలయాళంలో 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'లూసిఫర్'కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. లుసిఫర్‌ను 2022లో తెలుగులో కొన్ని మార్పులతో రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్'గా లూసిఫర్ తెరకెక్కింది. మోహన్‌లాల్ 'L2: ఎంపురాన్' ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.65 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: 'మా మూవీస్ సౌత్ ఆడియన్స్ చూడరు' - అభిమానం తమ సినిమాలపై ఉండట్లేదన్న సల్మాన్ ఖాన్.. నెట్టింట విమర్శలు
ఎల్ 2 ఎంపురాన్ స్టోరీ ఏంటంటే?
లూసిఫర్‌కు సీక్వెల్‌గా 'L2: ఎంపురాన్' మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. పీకే రాందాస్ మరణం తర్వాత (సచిన్ ఖేడ్కర్) ఐయూఎఫ్ పార్టీలో వివాదాలన్నింటినీ పరిష్కరించి జతిన్ రాందాస్ (టొవినో థామస్)ను సీఎంగా చేస్తాడు స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్ లాల్.) ఆ తర్వాత కేరళ వదిలి విదేశాలకు వెళ్లిపోతాడు. అయితే, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత జతిన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతాడు. ఐయూఎప్ పార్టీ నుంచి బయటకొచ్చి.. పీకేఆర్ అనే కొత్త పార్టీని స్థాపిస్తాడు. కేంద్రంలోని ఏఎస్ఎమ్ పార్టీతో పొత్తు పెట్టుకుని.. దాని సాయంతో అధికారం పొందాలని యత్నిస్తాడు. ఈ క్రమంలోనే హిందుత్వ వాది బాబా భజరంగీ (అభిమన్యు సింగ్)తో చేతులు కలుపుతాడు. జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శిని (మంజూ వారియర్)తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు.
మరోవైపు.. నెడుంపల్లి చెక్ డ్యామ్ కేంద్రంగా సాగుతోన్న అవినీతి అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతుంది. దీంతో కేరళలో గందరగోళ పరిస్థితులు ఏర్పడగా.. రాష్ట్రాన్ని కాపాడడానికి స్టీఫెన్ నడుంపల్లి మళ్లీ రావాలని చాలామంది కోరుకుంటారు. అయితే... ఇరాక్‌లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన దాడిలో అతను చనిపోయాడని వార్తలు వస్తాయి. నిజంగా స్టీఫెన్ నడుంపల్లి చనిపోయాడా? స్టీఫెన్ నడుంపల్లిగా కేరళ ప్రజలకు తెలిసిన ఖురేషి అబ్రామ్ ఏం చేస్తాడు? దేశ రాజకీయాల్లో అతను ఏం చేశాడు? అతని కోసం కొన్ని దేశాల గూఢచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి? కేరళ రాజకీయాలలో ఖురేషి అబ్రామ్ పాత్ర ఏమిటి? బాబా భజరంగీకి సయ్యద్‌లకు ఉన్న విరోధం ఏంటి.? వంటి అంశాలు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

